బీట్‌ రూట్‌ రసం కాదు.. నదిలోని నీళ్లు..!

9 Nov, 2020 18:38 IST|Sakshi

సాధారణంగా నది జలాలు నీలిరంగు లేదా తెలుపు రంగులో కనిపిస్తాయి. కానీ ఎప్పుడైనా నదిలో నీళ్లు  బీట్‌రూట్‌ రంగులోకి మారడం చూశారా.. అవును తెలియని కాలుష్య కారకాలు ఓ నదిని విషతుల్యం చేశాయి. వీటి కారణంగా నదిలోని నీరు నీలి రంగు నుంచి ముదురు గులాబీ (బీట్‌రూట్)‌ రంగులోకి మారాయి. అయితే ఇది మన దేశంలో నది కాదండోయ్‌. రష్యాలోని ఇస్కిటిమ్కా నది పరిస్థితి. ఒక ప్రత్యేకమైన కాలుష్య కారకం నదిలో కలిసిన తర్వాతనే నీరు ఇలా నీలి రంగు నుంచి బీట్‌రూట్‌ రంగులోకి మారిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ పరిస్థితికి కారణమైన రసాయనాల ‌ గురించి అధికారులు పరిశోధనలు కూడా చేస్తున్నారు. ఈ నదిలో నీళ్లు తమ కిమెరోవో పారిశ్రామిక ప్రాంతం వెళుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీట్‌ రూట్‌ రంగులో ఉన్న ఈ ఇస్కిటిమ్కా నది ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చదవండి: వైరల్‌ : నేను వెళ్లనంటూ ట్రంప్‌ మారాం

ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ.. ఇది ప్రస్తుతం నదిలాగా కనిపించడం లేదని, తినే పదార్థం క్రాన్‌బెర్రి జెల్లి మాదిరి కనిపిస్తుందని తెలిపాడు. నది రంగు మారడానికి కారణమైన కాలుష్య కారకం గురించి తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని  కెమెరోవో డిప్యూటీ గవర్నర్‌ ఆండ్రియా పానోవ్‌ తెలిపారు. నది నీరు ఇలా మారడానికి గల కారకులను తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. త్వరలోనే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఇస్కిటిమ్కా నదియే కాకుండా, పశ్చిమ రష్యాలోని నారో-ఫోమిన్స్క్ లోని మరో నది కూడా పరిశ్రమల నుంచి రసాయనాలు విడుదల తరువాత ఎర్రగా మారింది. చదవండి: గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు