మాంచెస్టర్‌లో మహారాష్ట్ర కుర్చీ.. 7000 కి.మీ ఎలా ప్రయాణించిందంటే?

1 Oct, 2021 11:34 IST|Sakshi

ప్రపంచం ప్రస్తుతం ఒక గ్రామంగా మారిపోయింది. ఏం అమ్మాలన్నా, కొనాలన్నా అంతర్జాతీయ మార్కెట్లతో చిటికలో పని జరిగిపోతుంది. ఒకచోట తయారైన వస్తువులు మరోచోట విక్రయం జరగుతుంది. గ్రామాల్లోని వస్తువులు దేశం దాటి ప్రపంచమంతా ప్రయాణిస్తుంటాయి. తాజాగా ఓ కుర్చీ మహారాష్ట్ర నుంచి యూకేలోని మాంచెస్టర్‌కు వెళ్లింది. ఖండాలు దాటిన జర్నీ ఆ కుర్చీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. అసలు ఇది 7000 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి ఎలా వెళ్లిందో దీని వెనక కథ ఎంటో తెలుసుకుందాం.

జర్నలిస్ట్‌ సునందన్‌ లేలే ఇటీవల ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ సిటీని సందర్శించాడు. అక్కడ ఓ రెస్టారెంట్‌లోని ఓపెన్‌ సీటింగ్‌ ఏరియాలో ఉన్న కుర్చీ అతన్ని బాగా ఆకర్షించింది. ఇనుముతో ఉన్న కుర్చీ వెనక మరాఠీలో ‘బాలు లోఖండే సవ్లాజ్‌’ అని రాసి ఉంది. దీనిని చూసిన అతను ఆశ్యర్యపోయాడు. ‘ఇది వింత కాదా’ అంటూ తన ట్విటర్‌లో దీనికి సంబంధించిన వీడియో పోస్టు చేశారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కుర్చీ ప్రయాణాన్ని చూస్తుంటే భారతీయ మార్కెట్ విస్తరణ ఏ విధంగా ఉందో అర్థమవుతోందని, చాలామంది మరాఠీలుగా గర్వపడుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: గ్లోబల్‌ స్టార్‌డమ్‌ దక్కిన తొలి ఇండియన్‌​ హీరో ఎవరో తెలుసా?

కాగా కుర్చీ మహారాష్ట్రలోని సాల్వాజ్‌ గ్రామానికి చెందిన టెంట్‌హౌజ్‌ బాలు లోఖండేకు చెందినది. ఇటీవల ప్లాస్టిక్‌ కుర్చీలకు డిమాండ్‌ పెరగంతో టెంట్‌హౌజ్‌ యజమాని ప్లాస్టిక్ కుర్చీలను వాడుతుండటంతో లోఖాండే తన పాత ఇనుప కుర్చీలను 15 ఏళ్ల క్రితం పాత ఇనుప సామానులకు అమ్ముకోవాల్సి వచ్చింది. .అది కాస్తా మహారాష్ట్ర నుంచి 7,627 కిలోమీటర్ల దూరంలోని మాంచెస్టర్‌కు చేరింది.
చదవండి: వైరల్‌: సింగిల్‌ మీల్‌కు లక్షా ఎనభై వేలు!!

A post shared by Sunandan Lele (@lelesunandan)

మరిన్ని వార్తలు