వైరల్‌.. ఈ ఫోటోలో ‘దెయ్యం’ ఉంది..చూశారా!

27 May, 2021 13:21 IST|Sakshi

ఒక్కొక్కరికీ ఒక్కో భయం ఉంటుంది. కొందరు నీళ్లు, ఎత్తైన ప్రదేశాలు, పాము ఇలా రకరకాలైన వాటిని చూసి భయంతో జంకుతారు. సాధారణంగా అధిక శాతం మందికి దెయ్యాలంటే భయం ఉంటుంది. ఇప్పటికీ అక్కడక్కడా చేతబడి, క్షుద్రపూజల నేపథ్యంలో జరిగిన నేరాల గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే దెయ్యాలపై పరిశోధనలు చేసేవారు దెయ్యాలు ఉన్నాయని కొన్ని రకాల ఆధారాలు చూపిస్తుంటారు. కానీ అవన్నీ వాస్తవానికి దగ్గగరా ఉండవు. అందుకే నేటికి సైతం దెయ్యం అంటే నమ్మని, నమ్మే వాళ్ల చర్చ జరుగుతూనే ఉంది. ఇక సోషల్ మీడియా డెవలప్ అయ్యాక ఈ దెయ్యాల గురించి తెలుసుకోవాళ్లన్న ఆసక్తి ఎక్కువవుతోంది.

తాజాగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన రెబెకా గ్లాస్‌బరో మహిళ కొన్ని నెలల క్రితం తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి స్నేహితులతో కలిసి హ్యాపీగా ఎంజాయ్‌ చేసింది. తమ ఆనందాలను బంధించేందుకు గుర్తుగా ఫోటోలు కూడా తీసుకున్నారు. తరువాత ఓ రోజు పార్టీలో దిగిన ఫోటోలు చూసుకుంటే అందులో అందరికంటే వెనకాల మరో ముఖం కనిపిస్తోంది. ముక్కు, కళ్లు, నోరు, జుట్టు ఉండి అచ్చం ఓ అమ్మాయి రూపం కంటపడింది. ఫోటో చూస్తుంటే నిజంగానే దెయ్యంలా అనిపిస్తోంది. అయితే ఈ ఘటన గతేడాది అక్టోబర్‌లో చోటుచేసుకోగా ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరలవుతోంది.

అయితే రెబెకా నివాసముంటున్న ఫ్లాట్‌లో ఇంతకముందు ఎవరో చనిపోయారని ప్రచారంలో ఉంది. దీంతో ఫోటోలో మరో ముఖం కనిపించడంతో తన స్నేహితులంతా ఆ ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ అక్కడ వాళ్లకు ఏం కనిపించలేదు. ఈ సంఘటన జరిగిప్పటి నుంచి సదరు యువతికి భయంతో అప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు. ఇక ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో  నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. "ఇది మీ వెన్నెముకకు వణుకు పుట్టించే ఫోటో. నిజంగా చాలా భయానకంగా ఉంది. ఓహ్ అది ఏమిటి. చాలా విచిత్రంగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కొందరు మాత్రం ఇది నిజం కాదని కొట్టి పారేస్తున్నారు. 

చదవండి:
వైరల్​: దుస్తులు చించేసి, మరీ ఘోరంగా..
వైరల్‌: ఈమె మనిషా.. దెయ్యామా?!

మరిన్ని వార్తలు