వైరల్‌: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్‌ ఓదార్పు

4 Mar, 2021 18:36 IST|Sakshi

మన జీవితం అనుకున్న వారు మధ్యలోనే ప్రాణాలు వీడితే ఆ బాధ వర్ణించలేనిది. ఈ శోకసంద్రం నుంచి బయట పడటానికి చాలా సమయం పడుతోంది. ఇలాంటి కష్ట సమయంలో మన వెంట ఉండి అండగా నిలిచి వాళ్లు కొంతమంది ఉంటారు. వాళ్ల ద్వారా ఆ బాధ నుంచి త్వరగా కోలుకోడానికి అవకాశం లభిస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని ఓ పాఠశాలలో మెలిస్సా మిల్నర్‌ అనే మహిళ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల ఈమె భర్త చనిపోయాడు. ఈ క్రమంలో టీచర్‌ను ఓదార్చడానికి ఓ స్టూడెంట్‌ అందమైన లేఖను రాసి ఆమెకు బహుకరించాడు. దీనిని సదరు మహిళ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. లెటర్‌లో టీచర్‌పై తనకున్న గౌరవాన్ని మాటల రూపంలో తెలియజేశాడు.

‘ప్రియమైన మిసెస్ మిల్నర్. మీరు భర్తను కోల్పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మిస్టర్ మిల్నర్‌ను మీరు ఇక చూడలేక పోయినప్పటికీ, మీ హృదయాలను కలిపే ఒక లైన్ ఎప్పుడూ ఉంటుందని మీరు ఇంకా తెలుసుకోవాలి. మీరు ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను.’ అని పేర్కొన్నాడు. అంతేగాక మెలిస్సా ఆకాశం వైపు చూస్తూ, తన హృదయాన్ని స్వర్గంలో తన భర్త హృదయంతో కలుపుతూ ఒక డ్రాయింగ్ కూడా వేశాడు. ప్రస్తుతం ఈ లెటర్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. లక్షల్లో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. ఇది చాలా ఎమోషన్‌ల్‌గా ఉందని లెటర్‌ను చదివిన నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. 

చదవండి: వైరల్‌: విమానంలో పిల్లి రచ్చ.. పైలట్‌పై దాడి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు