వైరల్‌ వీడియో: బిడ్డను కాపాడుకోవడం కోసం ఏనుగుల సాహసం

9 Sep, 2021 20:21 IST|Sakshi

మనుషులకు, జంతువులకు ప్రధాన తేడా.. విచాక్షణా జ్ఞానం. జంతువులు ఆలోచించలేవు.. మనం ఆలోచించగల్గుతాం. అయితే ప్రస్తుతం లోకం తీరు చూస్తే ఈ వ్యాఖ్యలకు అర్థం మారినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి ఆలోచనల్లో స్వార్థం పెరుగుతుంది. కళ్లేదుటే సాటి మనిషి చావుబతుకుల్లో కొట్టుమిటాడుతన్న పట్టించుకునే తీరక, మానవత్వం కరువవుతున్నాయి.

కానీ జంతువులు అలా కాదు.. తమ తోటి జీవికి కష్టం వచ్చిందని వాటికి తెలిస్తే చాలు.. కట్టకట్టుకుని వచ్చేస్తాయి. తమ సాటి ప్రాణిని కాపాడటానికి వాటికి తోచిన రీతిలో ప్రయత్నిస్తాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. మీ నుంచి మనుషులు ఎంతో నేర్చుకోవాలి. నిస్వార్థ ప్రేమకు, మానవత్వానికి ప్రతీకగా నిలిచారు అంటూ ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు.. 

టర్కిష్‌ మహిళ ఫైజెన్‌ తన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో ఓ ఏనుగు పిల్ల తల్లితో కలిసి నీటి కొలను దగ్గరకు వచ్చింది. పక్కనే మరో ఏనుగు కూడా ఉంది. అయితే ఉన్నట్లుండి పిల్ల ఏనుగు నీటిలో పడి పోతుంది. ఇది గమనించి తల్లి ఏనుగు బిడ్డను కాపాడటం కోసం ప్రయత్నిస్తుంది. ఈలోపు ఏనుగు పిల్ల పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ఇది గమనించిన రెండు ఏనుగులు నీటిలోకి దిగి.. పిల్ల ఏనుగును ఒడ్డుకు చేర్చుతాయి. ఆ తర్వాత ఆ మూడు ఏనుగులు అక్కడ నుంచి వెళ్లిపోతాయి.
(చదవండి: Viral Video: హద్దులు లేని ప్రేమ! ‘నేస్తమా.. ఇటు రా’)

అయితే ఈ రెండు ఏనుగులు.. పిల్ల ఏనుగును కాపాడటం కోసం ప్రయత్నిస్తుండగా.. వాటి వెనకే ఉన్న మరో ఏనుగు ఈ దృశ్యాన్ని చూస్తుంది. అక్కడకు వెళ్లి.. వాటికి సాయం చేయాలని భావిస్తుంది. కానీ అక్కడ కంచెలాంటి నిర్మాణం అడ్డుగా ఉండటంతో రాలేక అక్కడే తచ్చాడుతుంటుంది. (చదవండి: మనిషిని అనుకరించిన ఏనుగు.. ఏకంగా తొండంతో)

ఈ వీడియో చూసిన నెటిజనులు మీ తోటి ప్రాణిని కాపాడటం కోసం మీ ప్రాణాలకు తెగించి మరీ సాహసం చేశారు. మీ నిస్వార్థ ప్రేమకు, మానవత్వానికి హ్యాట్సాఫ్‌.. మిమ్మల్ని చూసి మేం మనుషులం చాలా సిగ్గుపడాలి.. నేర్చుకోవాలి అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

చదవండి: ‘‘కన్నీరాగడం లేదు.. జీవితాంతం వెంటాడుతుంది’’

మరిన్ని వార్తలు