షాకింగ్‌ వీడియో: కారు న‌డిపిన ఎనిమిదేళ్ల బాలుడు.. రోడ్డుపై రయ్యిమంటూ

25 Apr, 2022 21:01 IST|Sakshi

రోడ్లపై వాహనాన్ని నడపాలంటే తప్పకుండా నిర్ణీత వయసు కలిగి ఉండాలి. అంతేగాక డ్రైవింగ్‌ లైసెన్స్ ఉండాలి. భారత్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడానికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అయితే మైనర్లకు డ్రైవింగ్‌ అప్పజెప్పడం చట్టరిత్యా నేరం. ఈ క్రమంలో తాజాగా ఓ ఎనిమిదేళ్ల బాలుడు ఏకంగా కారును నడుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ షాకింగ్‌ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. భారత్‌లోలాగే పాకిస్థాన్‌లో కూడా 18 ఏళ్లు నిండిన వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ అనుమతి ఉంది. కానీ సియాల్‌ కోటకు చెందిన 8 ఏళ్ల బాలుడు నిబంధనలు అతిక్రమిస్తూ రోడ్డుపై టోయోటా ఫార్చ్యూనర్‌ ఎస్‌యూవీని నడుపుతూ కనిపించాడు.

వీడియోలోని బాలుడిని ఆయాన్‌గా గుర్తించారు. ఈ బాలుడు ఆరేళ్ల‌నుంచే కారు డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో త‌న ప‌దేళ్ల అక్క కారు ముందు నిల్చొని మొద‌ట అయాన్ డ్రైవింగ్ స్కిల్స్‌ను వివ‌రించింది. తరువాత అయాన్‌ ఒక్కడే కారు డోర్‌ తీసి డ్రైవింగ్‌ సీట్లో కూర్చొని సీటు బెల్టు పెట్టుకోకుండానే రహదారిపై కారు నడుపుతున్నాడు. బుడ్డోడు ఎత్తు తక్కువగా ఉండటంతో సీటు అంచున కూర్చోని డ్రైవ్‌ చేస్తున్నాడు. రోడ్డుపై కొన్ని వాహనాలు అత‌డి ప‌క్క‌నుంచి ఓవ‌ర్‌టేక్ చేయ‌డం చూడవచ్చు. అంతేగాక పిల్లవాడు కారు నడుపుతున్నంత సేపు వాడి కళ్లల్లో ఎలాంటి భయం, బెరుకు కనిపించలేదు.
చదవండి: దొంగల తెలివి...ఏటీఎం మిషన్‌నే తవ్వేందుకు యత్నం: వీడియో వైరల్‌

ఈ వీడియోను ‘అయాన్ అండ్ అరీబా’ అనే యూట్యూబ్ చాన‌ల్‌లో ఏప్రిల్ 1న పోస్టు చేశారు. ‘ఎనిమిదేళ్ల బాలుడు టొయోటా ఫార్చ్యూనర్‌ను ఎలా న‌డుపుతాడో ఈ రోజు మీకు చూపిస్తాం’ అని క్యాప్షన్‌తో అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయాన్ డ్రైవింగ్‌ను చూసిన చాలామంది నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొంతమంది ఆ అబ్బాయి త‌ల్లిదండ్రుల‌పై మండిప‌డుతున్నారు. పిల్లలకు డ్రైవింగ్‌ ఇవ్వడం ద్వారా ఇత‌రుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన చట్టవిరుద్ధం, బాధ్యతారాహిత్య‌మైన‌ది, ప్రమాదకరమైనద‌ని, ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇలాంటివి ప్రోత్సహించకూడదని కామెంట్ చేస్తున్నారు.
చదవండి: రష్యా చమురు డిపోలో అగ్ని ప్రమాదం: వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు