వీడియో: ​డ్రోన్‌లతో కుక్కలను దింపి దాడులు.. దెబ్బకు శత్రువు ఆటకట్టు

27 Oct, 2022 20:34 IST|Sakshi

చైనీస్‌ మిలటరీ ఒక సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. ఇంతవరకు మిషన్‌గన్‌తో కూడిన రోబో శునకాలను చూశాం. ఐతే వాటినే రణరంగంలోకి దింపి శత్రువుపై ఆకస్మకి దాడులు చేయించే టెక్నాలజీకి నాంది పలకింది చైనా రక్షణ శాఖ. ఈ మేరకు డ్రోన్‌ సాయంతో మిషన్‌గన్‌తో కూడిన రోబో శునకాలను శత్రువు ఉండే ప్రాంతంలో వదిలేస్తారు. అది వెంటనే తన టార్గెట్‌ని ఏర్పాటు చేసుకుంటూ దాడులు చేయడం ప్రారంభించింది.

ఇది శత్రువులకు సైతం అర్థంకాని విధంగా వ్యూహాత్మక ఆకస్మిక దాడులు చేస్తోంది. దీంతో శత్రువుని సులభంగా మట్టి కరిపించగలమని చైనీస్‌ మిలటరీ చెబుతోంది. అంతేకాదు ఆ రోబో కుక్క నాలుగు కాళ్లపై నుంచుని గన్‌ని ఓపెన్‌ చేసి తన టార్గెట్‌ని చూసుకుంటూ దాడులు నిర్వహిస్తోంది. అందుకు సంబంధించిన వీడీయోని చైనా మిలటరీ అనుబంధంగా ఉండే కెస్ట్రెల్ డిఫెన్స్ బ్లడ్-వింగ్‌కి సంబంధించిన విబో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి: మిస్‌ యూనివర్స్‌ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ)

మరిన్ని వార్తలు