రైలు వంతెనపై మంటలు...నదిలోకి దూకేసిన ప్రయాణికులు

22 Jul, 2022 11:00 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికాలోని బోస్టన్‌ శివార్లలోని రైలు వంతెనపై మంటులు చెలరేగాయని అధికారులు తెలిపారు. దీంతో దాదాపు 200 మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఐతే కొంతమంది భయంతో కిటికీల గుండా తప్పించుకోగా, మరికొంత మంది వంతెన కింద ఉన్న నదిలోకి దూకేసినట్లు తెలిపారు. ఈ ఘటన పై దర్యాప్తు చేసిన మసాచుసెట్స్ బే ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ కీలక విషయాలు వెల్లడించింది.

వెల్లింగ్‌టన్, అసెంబ్లీ స్టేషన్‌ల మధ్య ఉన్న వంతెన మీదుగా ప్రయాణిస్తున్న ఆరెంజ్ లైన్ రైలు దాని హెడ్ కార్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినట్లు పేర్కొంది. ఐతే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపింది. ఈ సంఘటనను చూసి భయపడి నదిలోకి దూకేసిన మహిళ మాత్రం వైద్య సహాయానికి నిరాకరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 

(చదవండి: గులాబీ వర్ణంలోకి ఆకాశం.. సినిమాను తలపించిన దృశ్యం.. ఏలియన్స్‌ పనేనా?)

మరిన్ని వార్తలు