Delivery Girl: రూ.650 టిప్‌ సరిపోలేదట! కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ గర్ల్‌.. ఆమె తీరును తప్పుబట్టిన నెటిజన్లు

8 Mar, 2023 17:53 IST|Sakshi

ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లు రాకతో ఇంటి వద్దనే ఫుడ్‌ని తెప్పించుకోవడం ప్రజలకు అలవాటుగా మారింది. కరోనా నుంచి వీటికి జనాదరణ కూడా పెరిగిందనే చెప్పాలి. అయితే డెలివరీ బాయ్స్‌ కస్టమర్లకు ఫుడ్‌ డెలవరీ చేసే క్రమంలో పలు వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ డెలివరీ పార్టనర్‌ టిప్‌ సరిపోలేదని అసహనంతో కస్టమర్‌తో జరిపిన సంభాషణ వైరల్‌గా మారింది.

ఆ టిప్‌ సరిపోలేదు....
ఇటీవల టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో చాలా పనుల కోసం బయటకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. ఇక చేతిలో మొబైల్‌, అందులో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంటే చాలు నిమిషాల్లో కొన్ని సేవలు ఏదైన మన ఇంటి ముందుకు వచ్చి ప్రత్యక్షమవుతున్నాయి. ఫుడ్‌ సంబంధించి కూడా ఆన్‌లైన్‌ యాప్‌ల రాకతో మనం కోరుకున్న ఫుడ్‌ జస్ట్‌ ఒక క్లిక్‌తో వచ్చేస్తుంది.

తాజాగా ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఓ కస్టమర్‌కు షాకిచ్చింది డెలివరీ పార్టనర్‌. అసలేం జరిగిందంటే.. డెలివరీ పార్ట్‌నర్‌ కస్టమర్‌ ఇంటి ముందుకు వచ్చి అతనితో మాట్లాడటం ప్రారంభించింది. ‘మీ ఫుడ్‌ ఆర్డర్‌ తీసుకువచ్చేందకు నేను పన్నెండున్నర మైళ్లు దూరం 40 నిమిషాల పాటు డ్రైవింగ్ చేసి వచ్చాను. అయితే మీరిచ్చిన టిప్ 8 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.650) నేను సంతోషంగా లేనని’ ఆమె అతనికి చెబుతుంది.

అయితే కస్టమర్‌ అదనంగా చెల్లించేందుకు నిరాకరిస్తాడు. దీంతో డెలివరీ పార్టనర్‌కు చిరెత్తుకురావడంతో ఫుడ్‌ ప్యాకెట్‌ను తీసుకొని కస్టమర్‌కు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. డ్రైవర్‌కు, కస్టమర్‌కు మధ్య జరిగిన పరస్పర సంభాషణ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆమె ‍ ప్రవర్తనను తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు.

చదవండి: Guinness Record: 24 గంటల్లో 8,008 పుల్ అప్స్.. గిన్నిస్ రికార్డు బద్దలు..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు