మనుషుల గొంతుల్లో పాములు దూరతాయట!

23 Sep, 2021 07:56 IST|Sakshi

గొంతులో వెలక్కాయ పడిందని అంటుంటారు.. నిజంగా ఎవరికైనా గొంతులో వెలక్కాయ పడిందో లేదో తెలియదు కానీ.. రష్యాలోని ఓ ఊరిలో మనుషుల గొంతుల్లో పాములు దూరతాయట. ఇదేమి చోద్యం అంటారా.. జరిగిందిదే మరి! రష్యాలో దగస్థాన్‌ అనే ప్రాంతంలో లెవాషి అనే గ్రామం ఉంది. ఇక్కడ ఇటీవల ఓ మహిళ ఆరుబయట గాఢ నిద్రలో ఉండగా హఠాత్తుగా గొంతులో తీవ్రమైన బాధతో మెలకువ వచ్చింది. గొంతులో ఏదో కలియ తిరిగేస్తున్నట్లు ఉంది. వెంటనే బంధువులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యులు ఆమెకు మత్తుమందు ఇచ్చి, గొంతులో ఉన్న జీవిని బయటకు తీశారు. దాన్ని చూడగానే వైద్యులు, ఇతర సిబ్బంది భయంతో వణికిపోయారు. ఆ వచ్చింది ఓ పాము. నాలుగడుగుల పామును ఎలాగోలా బయటకు తీశారు. ఇటువంటి ఘటన చాలా అరుదైనప్పటికీ, ఇంతకు ముందూ ఈ ప్రాంతంలో ఇటువంటి కేసులు ఒకట్రెండు వచ్చాయట. అందువల్ల ఎవరూ ఆరు బయట నిద్రించవద్దని అక్కడి వారు చెబుతున్నారు. 
 

మరిన్ని వార్తలు