Viral Video: ఎయిర్‌పోర్టు అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన శునకం

12 May, 2022 16:29 IST|Sakshi

ప్రయాణాల్లో కొంతమంది తమ పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్తుంటారు. సొంత వాహనాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లడం సులువే కానీ.. ట్రైన్‌, విమానం వంటి వాటిల్లో తీసుకెళ్లడం కొంచెం కష్టం. అవి ఎదుటి వారికి ఎలాంటి హానీ చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఓ ఎయిర్‌పోర్టులో ఒక శునకం అధికారులు ముప్పుతిప్పలు పెట్టింది. విమానాశ్రయం రన్‌వే అంతా పరుగులు పెట్టించింది. ఈ సంఘటన మెక్సిలో చోటుచేసుకుంది.

గ్వడలాజరలో గల మిగ్వుల్ హిడాల్గొ వై కాస్టిల్లా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కను తీసుకొచ్చింది. సరిగ్గా బోర్డిండ్‌ సమయానికి కుక్కకు కట్టిన తాడు తెగిపోయింది. ఇంకేముంది ఆ కుక్క యాజమాని నుంచి తప్పించుకొని విమానం నుంచి బయటకు వచ్చేసింది. విమానం కింద నుంచి. రన్ వైపే మొత్తం కలియ తిరిగింది. ఉరుకులు పరుగులు తీసింది. దీంతో కుక్క వెంబడి అధికారులు పరుగులు తీశారు. అయినా ఎంతకూ అది దొరకలేదు. అయితే ఆ సమయంలో రన్‌వే పైకి వాహనాలు రాకుండా అధికారలు జాగ్రత్తలు తీసుకున్నారు. 

చివరికి తిరిగి తిరిగి అలసిపోయిన సిబ్బంది ఎలాగోలా ఆ కుక్కను పట్టుకోవడంతో అందరూ హమ్మాయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిని ప్రత్యక్ష సాక్షి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ వీడియోలో శునకం పరుగు పెట్టించే అంశం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా కుక్క ఎలా తప్పించుకుందనేదానిపై క్లారిటీ లేదు. ఇక పప్పీని పట్టుకునే క్మంలో వారికి ఎలాంటి గాయం కాలేదని తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే 2 లక్షల మంది వీక్షించారు. దీనిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అధికారులకు శునకం మంచి వ్యాయామం చేయించిందని కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు