వైరల్‌: 10, 20 ఉండనివ్వండి.. దొంగను బతిమాలిన షాప్‌ ఓనర్‌

25 May, 2021 15:02 IST|Sakshi

దొంగతనం అంటే చేతికి అందినంత దోచుకొని పరారవ్వడం. ఎవరూలేని సమయంలో ఇంట్లో, షాప్‌లోకి చొరబడి ఎత్తుకెళ్లడం, లేదా యాజమానిని బెదిరించి దొరికినంత సొమ్ముతో ఊడాయించడమే దొంగొడి పని. అయితే పాకిస్తాన్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో జరిగిన దొంగతనం మాత్రం నెటజన్ల చేత తెగ నవ్వులు పూయిస్తోంది. షాప్‌లోకి కస్టమర్‌లా చొరబడిన ఓ దొంగ అక్కడి సొమ్మును కాజేయాలని ఫథకం పన్నాడు. మొదట అల్మారాలోని కొన్ని వస్తువులను తీసుకొని తనతో వచ్చిన వేరే వ్యక్తికి అప్పగించి, ఆ వస్తువులను కారులో పెట్టమని కోరాడు.

ఇది చూసిన యాజమాని భయంతో దొంగ అడగకముందే తన నగదు కౌంటర్‌లో ఉన్న డబ్బులన్నీ ఓ సంచిలో పెట్టడం ప్రారంభించాడు. మొత్తం నగదంతా సంచిలో పెట్టి దొంగ కోసం సిద్ధం చేశాడు. వెంటనే దొంగ పెద్ద నోట్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించడంతో, భయపడిన ఓనర్‌.. తను ఇంకా తగినంత అమ్మకం చేయలేదని ఒప్పిగ్గా బదులిచ్చాడు. అంతేగాక క్యాష్‌ కౌంటర్‌లో 10, 20 ఉంచి వెళ్లండి అని దొంగనే బతిమాలాడు. దీనికి దొంగ సైతం  హా సరే అని రిప్లై ఇచ్చాడు.

ఇంత జరిగాక కూడా చివరికి ‘మరోసారి మా షాప్‌లోకి రాకండి ప్లీజ్‌’ అంటూ దొంగను కోరాడు. దీనికి దొంగ కూడా అంగీకారం తెలిపాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను మనోజ్‌ మెహతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా..  ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. ఇక ‘ఇంత ప్రేమతో కూడిన దొంగతనం ఎక్కడ జరుగుతుంది. పాపం.. షాప్‌ ఓనర్‌ చాలా దయగల మనిషి’ అంటూ నెటిజన్లు ఫన్నీ కాకమెంట్‌ చేస్తున్నారు.

A post shared by @notmanoj

>
మరిన్ని వార్తలు