జుట్టుతో డ్రెస్‌.. ‘బికినీ, పొట్టి దుస్తుల కంటే బాగానే ఉంది’

26 Jun, 2021 17:01 IST|Sakshi

‘ఓ వాలు జడా.. మల్లెపూల జడా.. ఓ పాము జడా.. సత్యభామ జడా’... అంటూ రాధాగోపాలం సినిమాలో స్నేహ జడను శ్రీకాంత్‌ అందంగా వర్ణించిన సాంగ్‌ అందరికి గుర్తుండే ఉంటుంది. అవునండి అమ్మాయిలకు సగం అందం ఆమె జుట్టు వల్లే కలగుతుందంటే అతిశయోక్తి కాదు. చాలా మందికి పొడుగు జుట్టు అంటే ఇష్టం.. కాదు కాదు పిచ్చి. కేశాల పెరుగుదలకు మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు, ఆయుర్వేద మూలికలు.. ఇలా అన్నింటిని వాడేస్తుంటారు. అయినా అది అందరికి సాధ్యపడదు. ఇక పొడుగు జుట్టు ఉన్న వారిని చూసి అందరు కుళ్లుకోవడం తెలిసిన విషయమే.  చకన్నమ్మ ఏం చేసినా అందమే అన్నట్లు పొడవాటి జుట్టు కలిగిన వారు దానిని ఎలా చేసిన అందంగానే ఉంటుంది.

తాజాగా ఓ అమ్మాయి తన జుట్టుతో వినూత్నంగా ఆలోచించింది. తనకున్న తెలివిని ఉపయోగింది ఇంత వరకు ఎవరూ చేయని ఓ వింత పని చేసింది. తన లాంగ్‌ హెయిర్‌ను అందమైన డ్రెస్‌లా అలంకరించింది. దీనికి సంబంధించిన వీడియోను హెప్గుల్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో ఓ యువతి క్యాప్‌, సన్‌ గ్లాసెస్‌ ధరించి డ్రెస్‌ లాగా తన పొడవాటి జుట్టును చుట్టేసింది.. అది సరిగా ఉండేందుకు నడుం వద్ద ఓ బెల్ట్‌ను ఉపయోగించింది. యువతి జుట్టు పొడుగ్గా, మందంగా ఉండటంతో డ్రెస్‌ లాగా కరెక్ట్‌ సెట్‌ అయ్యింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మాయి తెలివిని ప్రశంసిస్తున్నారు. బికినీలు, పొట్టి దుస్తులు ధరించే వారికంటే ఇది ఒకింత మంచిగానే ఉందంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరికొంతమంది యువతి జుట్టు  నిజమైనది కాకపోవచ్చని ఆమె హెయిర్ ఎక్స్‌టెన్షన్స్‌ని ఉపయోగించిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: జుట్టు బాగా రాలుతోందా.. ఇలా చేస్తే రాలడం తగ్గి, పెరుగుతుంది!

A post shared by hepgul5 (@hepgul5)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు