68 మంది కవలలతో ఫ్యాషన్‌ షో: వీడియో వైరల్‌

26 Sep, 2022 20:32 IST|Sakshi

ఇప్పటి వరకు పలు రకాల ఫ్యాషన్‌ షోలు చూసి ఉంటాం. వాటిల్లో వారు ధరించిన బ్రాండెడ్‌ ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తూ సాగేవి. ఇక్కడోక ఫ్యాషన్‌ షో మాత్రం అత్యంత విభిన్నంగా రూపొందించారు. మాగ్జిమమ్‌ ఎవరి ఇంట్లోనైనా ఇద్దరు అక్కచెల్లెళ్లు, లేదా అన్నాదమ్ములు లేదా కవలలు ఉంటే ఒకేలాంటి డ్రస్‌లు వేస్తారు. దీన్నే థీమ్‌గా తీసుకుని కవలలతో ఫ్యాషన్‌ షో నిర్వహించింది ఓ ‍ ప్రముఖ కంపెనీ

వివరాల్లెకెళ్తే... ఈ షోలో ఇద్దరో లేదా ఐదోగురో కవలలు కాదు. ఏకంగా 68 మంది కవలలతో ఫ్యాషన్‌ షోని ప్రదర్శించారు. ఈ షోని ఇటాలియన్‌ దుస్తుల, జ్యువెలరీకి సంబంధించిన బ్రాండ్‌ గుస్సీ 'గుస్సీ ట్విన్‌బర్గ్‌' పేరుతో ఈ ఫ్యాషన్‌ షోని నిర్వహించింది. అలెశాండ్రో మిచెల్‌ అనే ప్రముఖ డిజైనర్‌ 2022-23 స్ప్రింగ్‌ సమ్మర్‌ సీజన్‌ పేరిట మిలాన్‌ ఫ్యాషన్‌ షోలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. ఈ షోకి సంబంధించిన వీడియోలను గుస్సీ బ్రాండ్‌ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట చేసింది.

ఆ వీడియోలో ఒకే రకమైన దుస్తులు, జువైలరీని ధరించిన కవలల మోడళ్లు నడుస్తూ వస్తుంటారు. మిచెలల్‌ తన ఫ్యాషన్‌ షోలో పురాతన కాలం నాటి దుస్తులు, సింబల్స్‌ను ఉపయోగించి అప్పటి నాగరికతను ప్రతిబింబించేలా రూపొందించారు. పాతకాలం నాటి సినిమాల్లో ఉపయోగించిన దుస్తులను కూడా కవలల మోడళ్లు ఈ ఫ్యాషన్‌  షోలో ప్రదర్శించారు. ఈ వీడియోకి ఏడు వేలకు పైగా వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: పుతిన్‌ ప్రకటన సృష్టిస్తున్న ప్రకంపనం...గాయపడ్డ కమాండర్‌: వీడియో వైరల్‌)
 

మరిన్ని వార్తలు