ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం... స్పాట్‌లో ఆహుతైన వాహనాలు

6 Aug, 2022 14:57 IST|Sakshi

రోడ్డు ప్రమాదాలు కొన్ని అనుకోకుండానో లేక మద్యం తాగి డ్రైవ్‌ చేయడం వల్ల జరిగే పలు ప్రమాదాలు గురించి విని ఉంటాం. కొంతమంది నిర్లక్ష్యపూరితంగా, భాధ్యత రహితంగా రద్దీగా ఉండే రోడ్డుపై అతి వేగంగా కారు నడిపి ఘోర రోడు ప్రమాదాలకు కారణమవుతుంటారు. వారి ప్రాణాలే కాకుండా పక్కవారి ప్రాణాలను కూడా  ప్రమాదంలోకి నెట్టేస్తారు. అలాంటి ఘోర రోడ్డు ప్రమాదం యూఎస్‌లోని లాస్‌ ఏంజిల్స్‌లో చోటు చేసుకంది.

వివరాల్లోకెళ్తే....అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో హిల్స్‌ ఏరియాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న మెర్సిడేస్‌ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో గర్భిణి మహిళ, ఆమె ఏడాది  వయసున్న చిన్నారి తోపాటు ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున్న మంటలు లేవడంతో రెండు కార్లు అక్కడికక్కడే అగ్నికి ఆహుతై పోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఈ ప్రమాదానికి గల కారణాలు గురించి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నికోల్‌ లింటన్‌ అనే 37 ఏళ్ల నర్సు మెర్సిడేస్‌ కారుని అతి వేగంగా డ్రైవ్‌ చేస్తూ రోడ్డు పై ఉన్న వాహనాలను ఢీ కొట్టిందని తెలిపారు. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు లేగిసాయని, దీంతో సంఘటన స్థలంలోని రెండు వాహానాలు ఆహుతైపోయాయని చెప్పారు. సదరు నర్సు నికోల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని వెల్లడించారు. మృతి చెందిన గర్భిణి చెకప్‌ నిమిత్తం తన భర్త, కొడుకుతో కలిసి ఆస్పత్రికి వెళ్తున్న తరుణంలో ఈ ప్రమాదం బారిన పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది

(చదవండి: పులినే రమ్మంటూ బస్‌ విండో తెరిచాడు... అంతే ఒక్క జంప్‌ చేసి...)

మరిన్ని వార్తలు