అవును, 139 ఏళ్ల భవనం రోడ్డు దాటుతోంది!

23 Feb, 2021 13:06 IST|Sakshi

వాషింగ్టన్‌: రోడ్లను వెడల్పు చేస్తున్న క్రమంలో పెద్ద చెట్లు మధ్యలో వస్తే వాటిని కూకటివేళ్లతో పెకిలించి కొత్త చోటుకు తీసుకెళ్లడం తెలిసిన విషయమే. కానీ ఇక్కడ చెట్టును కాకుండా ఏకంగా ఓ పెద్ద భవంతినే దారి తప్పించారు. అది కూడా ఏళ్ల నాటి పురాతన భవనాన్ని ఉన్న చోటు నుంచి మరో చోటుకు తరలించారు. దీంతో 139 ఏళ్ళ చరిత్ర ఉన్న ఆ భవనం తరలింపు వార్తలో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫ్రాంక్లిన్‌ వీధిలో ఓ పెద్ద భవనం ఉంది. బయటివైపు ఆకుపచ్చని రంగులో ఉండి, అందరిని ఆకర్స్తుంది.

1880 లో ఇటాలియన్‌ శైలిలో దీనిని నిర్మించారు. న్యూస్‌ ఎన్‌ఎఫ్‌ గేట్‌ ప్రకారం దీన్ని కొత్త చోటుకు మార్చాలనుకున్నారు. ఇంకేముందీ, దాని పునాదుల పైన జాగ్రత్తగా కట్‌ చేసి.. రిమోట్‌ కంట్రోల్‌తో నడిచే హైడ్రాలిక్‌ డాలిని భవనం కింద అమర్చారు. ఆ తర్వాత మెల్లిగా అక్కడి నుంచి కదిలించారు. ఇక ఈ ఇంట్లో మొత్తం 7 బ్లాకులున్నాయి. 80 అడుగుల వెడల్పు ఉన్న ఈ భవంతిలో 6 పెద్ద గదులు, 3 స్నానాల గదులున్నాయి.

ఇక దీన్ని షిఫ్ట్‌‌ చేసే క్రమంలో భవనం రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద పడవ నేలపై వెళ్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ విడ్డూరాన్ని చూసేందుకు వేలాదిమంది ప్రజలు తరలి వచ్చారు. ఇప్పుడు ఈ వీడియో ​కాస్తా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ భవనాన్ని జరపడానికి దాదాపు 8 సంవత్సరాలు పట్టిందని దాని యజమాని తెలిపాడు. భవనాన్ని కదిలించేటప్పుడు మధ్యలో ఏవి అడ్డురాకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నానని చెప్తున్నాడు.

చదవండి: 
వైరల్‌: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్‌
ఏనుగు పైకి నగ్నంగా: 'సిగ్గు లేదా?'

మరిన్ని వార్తలు