పుతిన్‌ ప్రకటన సృష్టిస్తున్న ప్రకంపనం... గాయపడ్డ కమాండర్‌: వీడియో వైరల్‌

26 Sep, 2022 16:23 IST|Sakshi

Man Decide Jail Is Better Than Deat In Ukraine War: రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌ యుద్ధం కోసం పెద్ద ఎత్తున​ మిలటరీ మొబైలైజేషన్‌(సైనిక సమీకరణ) కోసం పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అంటే యుద్ధంలో పాల్గొనే వయస్కులందరికి నిర్బంధ సైనిక శిక్షణతో యుద్ధానికి సన్నద్ధం అయ్యేలా చేసి కదన రంగంలోకి దింపుతారు. దీంతో రష్యన్‌ యువతలో తీవ్ర అలజడి మొదలైంది.

ఎలా తప్పించుకోవాలంటూ ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వేరే దేశాలకు పారిపోయే యత్నాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక రష్యాన్‌ యువకుడు డ్రాఫ్ట్‌ కార్యాలయం(సైనిక శిక్షణ కార్యాలయం)పై దాడులు జరిపాడు. అంతేకాదు ఆ కార్యాలయంలో నిర్బంధ సైనిక శిక్షణకు వచ్చిన వారిని పారిపోమంటూ పిలుపునిస్తూ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో డ్రాఫ్టింగ్‌ కార్యాలయ కమాండర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడు అధికారిని పాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌కి సమీపంలో కాల్పులు జరిపాడు.

ఈ ఘటన రష్యాలోని సైబీరియన్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో పోలీసులు వెంటనే అప్రమత్తమై దుండగడుని రుస్లాన్ జినిన్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో ఉక్రెయిన్‌ యుద్ధం కోసం మొబైలైజేషన్‌ చేయడంతో ఈ కాల్పులకు తెగబడ్డానని చెప్పాడు. అంతేగాదు ఉక్రెయిన్‌ యుద్ధంలో చనిపోయే కంటే జైల్లో ఉండటమే మంచిదని ఇలా చేసినట్లు చెప్పాడు. అధికారులు సదరు కమాండర్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐతే అతడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: పుతిన్‌ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం..భయాందోళనతో దేశం బయటకు!)

మరిన్ని వార్తలు