కిమ్‌ జోంగ్‌ హెయిర్‌ కట్‌ కావాలి.. వైరలవుతోన్న వీడియో

13 Sep, 2021 17:32 IST|Sakshi

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వాప్తంగా జనాలకు ఇతని పేరు సుపరిచితమే. ఇతను వార్తల్లో నిలిచేది కొన్నిసార్లే అయినా తన ప్రత్యేకతను చూపిస్తుంటాడు.  ఇప్పుడు కిమ్‌ జోంగ్‌ పేరు మరోసారి వైరలవుతోంది. అయితే ఇందుకు ఓ వ్యక్తి చేసుకున్న హెయిర్‌ కట్‌ కారణం. వివరాలు.. ఓ వ్యక్తి సెలూన్‌లోకి వెళ్లాడు. అక్కడ తనకు ఏ స్టైలిష్‌ హెయిర్‌కట్‌ అవసరం లేదని, కానీ ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ లాంటి హెయిర్‌ స్టైల్‌ కావాలని కోరాడు. అయితే ఇది బార్బర్‌కు సవాల్‌ లాంటిదే అయినప్పటికీ.. కిమ్‌ లాంటి హెయిర్‌ కట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. ఆఖరికి అతను ఆ వ్యక్తి జుట్టును అచ్చం కిమ్ జోంగ్ లాగానే మార్చాడు. చదవండి: వైరల్‌: భల్లుకాల బంతాట.. భలే ఆట అంటున్న నెటిజన్స్‌

కిమ్‌ జోంగ్‌ మాదిరి హెయిర్‌ కట్‌ అంతా అయిపోయిన తరువాత దీనికి సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ  వీడియోలో ఒక వ్యక్తి సెలూన్‌లో కుర్చీపై కూర్చొని కనిపిస్తాడు. నియంత కిమ్ జోంగ్ ఉన్ లాగా అతను తన జుట్టు కత్తిరింపుతో నవ్వుతూ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. బార్బర్‌ని కూడా వీడియో క్లిప్‌లో కనిపిస్తాడు. ఈ సమయంలో ఇద్దరూ నవ్వుతుంటారు. ‘కిమ్ జోంగ్ ఉన్ స్టైల్ హెయిర్‌కట్’క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్‌ హుష్‌కాకి

కొందరు అచ్చు కిమ్‌లా ఉన్నావని అంటే మరొకరు కిమ్ భారత దేశం ఎప్పుడు వచ్చాడు అంటూ కామెంట్స్ జోడిస్తున్నారు. ఈ వ్యక్తి కిమ్ జాంగ్ ఉన్ వేషం ధరించి ఉత్తర కొరియాకు వెళ్లాలని, అక్కడ సరిహద్దు గార్డ్స్‌ను  గందరగోళానికి గురిచేయాలని మరొక యూజర్ అన్నారు. బార్బర్ తలుచుకుంటే మామూలు వ్యక్తిని సెలబ్రిటీ చేయగలడంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

మరిన్ని వార్తలు