ఈ దొంగోడి ప్లాన్‌ బెడిసికొట్టింది.. ఏడుస్తూ ప్లీజ్‌ వదిలేయండి!

22 Apr, 2021 15:05 IST|Sakshi

కాలిఫోర్నియా : దొంగతనం చేయాలంటే పక్కా ప్లాన్‌ వేయాలి. ఎవరికి చిక్కకుండా చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఎంత జాగ్రత్త వహించినా కొన్నిసార్లు అడ్డంగా బుక్కైపోతుంటారు. తాజాగా అలాంటి ఓ ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియనాలోని శాస్‌ లియాండ్రోలో ఓ ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేయాలని పక్కా ప్లాన్‌ వేశారు. దోచుకునేందుకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలోనే ఓ వ్యక్తి తన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కారు తాళం తీసేలోపు ఈ ఇద్దరు దొంగలు తుపాకీతో కారు వ్యక్తి దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు. ఇద్దరిలో ఓ వ్యక్తి తన తుపాకీతో అతనిని బెదిరించాడు. అయితే ఇక్కడే దొంగల ప్లాన్‌ రివర్స్‌ అయ్యింది.

దొంగల బెదిరింపులకు కారు యాజమాని భయపడకపోవడమే కాకుండా తుపాకీ పట్టుకున్న దొంగను గట్టిగా పట్టుకున్నాడు. అతని గట్టిగా కొట్టి ఒక్క దెబ్బతో కిందపడేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో చేసేదేం లేక లొంగిపోయిన దొంగ ఏడుస్తూ ‘సరే సరే ఆల్రైట్‌ నన్ను వెళ్లనివ్వండి’ అంటూ వేడుకున్నాడు. అతనితో వచ్చిన మరో దొంగకూడా అతన్ని వదిలిపెట్టండి అంటూ అరవడం వీడియోలో వినిపిస్తోంది. ఇక చివరికి ఆ వ్యక్తి దొంగను వదిలిపెట్టేస్తాడు. దీంతో ఇద్దరు అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను డావెన్యూ వరల్డ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో చేశారు. కాలిఫోర్నియాలో అతని దొంగతనం పాపం అనుకున్నట్లు జరగలేదు అనే క్యాష్టన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరలవుతోంది. సదరు వ్యక్తి ధైర్యాన్ని, సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

చదవండి: కారులో రూ.12 లక్షల చోరీ.. 24 గంటల్లో స్వాధీనం
ముగ్గురు ఓఎన్‌జీసీ సిబ్బందిని కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు

 

A post shared by Fifty Shades of Whey (@davenewworld_)

మరిన్ని వార్తలు