వైరల్‌: వధువు పెళ్లి గౌనులోకి దూరిన వ్యక్తి.. అందరూ చూసేశారు!

17 Jun, 2021 18:50 IST|Sakshi

పెళ్లిలో వధూవరులిద్దరూ అందంగా, ఆకర్షణీయంగా తయారవ్వడం అందరికీ తెలిసిన విషయమే. వారి ఆచారాలు, సంప్రదాయలు ఏమైనప్పటికీ అందరికంటే స్పెషల్‌గా ముస్తాబవుతారు. అయితే వధూవరులిద్దరిలో ఎక్కువగా అందరి కళ్లు పెళ్లి కూతురుపైనే ఉంటుంది. ఆమె వస్త్రాధారణ, అభరణాలు, మేకప్‌ ఇలా అన్నింటిపై ప్రతి ఒక్క దానిని గమనిస్తూ ఉంటారు. ఇక వధువుని పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చే సీన్‌ పెళ్లితంతు మొత్తంలో హైలెట్‌గా నిలుస్తోంది. పైన చెప్పిన విధంగానే ఓ పెళ్లి కార్యక్రమంలో వధువు అందమైన గౌనులో రెడీ వేదిక వద్దకు నడుచుకుంటూ వచ్చింది. వరుడు ఆమెను చేతిని అందుకుంటున్న క్షణంలో ఓ వ్యక్తి ఆమె గౌను కింద నుంచి ఓ వ్యక్తి అనూహ్యంగా బయటకు వచ్చాడు.

అది చూసిన వరుడితో సహా అతిథులంతా నోరెళ్లబెట్టారు. అయితే, అసలు విషయం తెలిసి అంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.ఫిలిప్పీన్స్‌లో జరిగిన పెళ్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోయల్ లునేసా అనే వ్యక్తి బ్రైడల్ ఇవెంట్స్‌లో పనిచేస్తున్నాడు. తాజాగా ఓ పెళ్లిలో వధువు కోసం ఆ సంస్థ గౌను తయారు చేసింది. అయితే, పెళ్లి రోజున గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో. వధువు ఆ గౌనులో నడుస్తుంటే.. గాలికి పైకి లేస్తోంది. గౌను పైకి లేవకుండా ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరికి రోయల్ ఓ నిర్ణయం ఆలోచించి. అతడు వధువు గౌనులోకి దూరతానని చెప్పాడు. ముందు అందరూ అతని నిర్ణయాన్ని ఆశ్చర్యంగా చూసినా.. చివరికి అంగీకరించారు. దీంతో అధిక గాలులకు డ్రెస్‌ ఎగరకుండా సక్రమంగా ఉంచేందుకు ఆమె దుస్తుల కింద అతను దాక్కున్నాడు.

ఇలా వధువు పెళ్లి వేడుక వద్దకు చేరే వరకు ఆమె గౌనులోనే ఉన్నాడు. వరుడు ముందుకొచ్చి ఆమె చేతిని అందుకోగానే.. అతను ఆమె గౌను నుంచి వేగంగా బయటకు వచ్చేశాడు. అయితే అతన్ని ఎవరూ చూడలేదు అనుకున్నాడు కానీ అప్పటికే అతిథులు అది చూసి షాక్‌కు గురయ్యారు. అంతేగాక కెమెరాలోనూ ఇదంతా రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అనంతరం ఈ విషయంపై రోయల్ మాట్లాడుతూ.. తను నిజంగా వధువు పెళ్లి దుస్తుల కింద దూరిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. అంతేగాక అందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు. పెళ్లిలో బలంగా గాలులు వీస్తుండటంతో వధువు తన డ్రెస్‌తో ఇబ్బంది పడుతుందని, అందుకే ఏం చేయాలో తెలియక అలా చేశానని ఆ వ్యక్తి చెప్పాడు. వధువు ఆ గౌను లోపల మరో డ్రెస్ వేసుకుందని, దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొన్నాడు.

చదవండి: 
పెళ్లిలో ప్రత్యక్షమైన మాజీ ప్రియుడు.. తర్వాత సీన్‌ ఏంటంటే! 
ముద్ద నోట్లో పెట్టుకుందామనుకుంది.. అంతలోనే దాపురించాడు!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు