ఐస్‌క్రీం కొనడానికి వచ్చి ఏం చేశాడో తెలుసా... నవ్వాగదు!

11 Nov, 2021 13:54 IST|Sakshi

చాలా సార్లు దుకాణాల్లో అ‍మ్మే వ్యక్తులను ఏదోరకంగా వస్తువులను పట్టుకువెళ్లిపోయే వాళ్లను చూసే ఉంటాం. అంతేందుకు చాలా మటుకు అమ్మేవాణ్ణి ఏదోరకంగా మాయ చేసి ఇచ్చిన రేటుకుంటే ఎక్కవ వస్తువులను తీసుకుపోయే వాళ్లను కూడా చూసి ఉంటాం. ఇలా బహిరంగంగా అందరూ చూస్తుండగా, అదీ కూడా షాపింగ్‌ మాల్‌లో ఒక టర్కీష్‌ ఐసీక్రీంని పట్టుకుపోతాడు. అది ఎక్కడ జరిగిందో ఏంటో అని ఆలోచింకండి చదివేయండి.

(చదవండి: బంపర్‌ ఆఫర్‌....వ్యాక్సిన్‌ తీసుకో..బహుమతి పట్టు)

ఒక షాపింగ్‌ మాల్‌లో ఒక టర్కిష్‌ ఐస్‌క్రీం దుకాణదారుడు అ‍త్యంత నైపుణంగా ఐస్‌క్రీం కోన్‌పై ఐస్‌క్రీంని చాలా వెరైటీగా అలంకరిస్తాడు. అందుకోసం అని ఒక కస్టమర్‌ ఆ దుకాణదారుడు వద్దకు వచ్చి నిలబడతాడు. ఆ వ్యాపారి ఒక కోన్‌ తీసుకుని పట్టుకోమని సదరు వ్యక్తికి ఇస్తాడు. ఇంతలో సదరు వ్యాపారి చాలా నైపుణ్యంతో ఐస్‌క్రీ పెడదామని చూస్తుండగానే కొనడానికి వచ్చిన ఆ వ్యక్తి ఆ ఐస్‌క్రీంని మొత్తం తీసుకుని పట్టకుపోతాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా చప్పట్లు కొడతూ నవ్వుతుంటారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పైగా లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి చూడండి.

(చదవండి: యాహూ! నేను పగలుగొట్టేశాను)

మరిన్ని వార్తలు