డేంజరస్‌‌: జలపాతం అంచున బికినీ షూట్‌

24 Jan, 2021 16:22 IST|Sakshi

వాషింగ్టన్‌: మోడల్‌ అన్నాక ఫొటోషూట్లు సర్వసాధారణం. వెరైటీ డ్రెస్సులతో కొత్త కొత్త స్టిల్స్‌తో ఫొటోలు క్లిక్‌మనిపిస్తూనే ఉంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ యంగ్‌ మోడల్‌ మాత్రం బికినీలో ఫొటోషూట్‌ చేయాలనుకుంది. అది కూడా అందనంత ఎత్తులో! అవును. పెన్సిల్వేనియాకు చెందిన 25 ఏళ్ల అమైరీస్‌ రోజ్‌ గతేడాది డిసెంబర్‌లో హాలీడేస్‌కు జాంబియా వెళ్లింది. అక్కడ ప్రపంచంలోనే అత్యంత పొడవైన విక్టోరియా జలపాతాన్ని సందర్శించింది. డెవిల్స్‌ పూల్‌గా పేరుగాంచిన ఈ జలపాతాన్ని చూసి ముచ్చటపడిపోయిన ఆమె అక్కడ బికినీ ఫొటోషూట్‌కు సిద్ధమైంది. 1640 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు నేలమీదకు దూకే అంచులో పడుకుని కెమెరాకు పోజులిస్తూ ఫొటోలు దిగింది. వీటితోపాటు ఓ వీడియోను సైతం అభిమానులతో పంచుకుంది. "అంచుల్లో జీవితం.. ఇక్కడ చాలా బాగుంది" అంటూ క్యాప్షన్‌ పొందుపరిచింది. అప్పటి పోస్టు తాజాగా మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: ఇలాంటి ఫ్యామిలీని ఎక్కడా చూసుండరు)

ఈ సందర్భంగా చాలామంది ఆమె డేంజరస్‌ స్టంట్‌ను విమర్శించారు. 'ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది' అని హెచ్చరిస్తూనే 'ఫాలోవర్లను సంపాదించుకోవడం కోసం ఇలాంటి పిచ్చిపనులు అవసరమా?' అని నిందించారు. దీనిపై అమైరీస్‌ స్పందిస్తూ.. 'ఫొటోషూట్‌ చాలా ప్రశాంతంగా, జాగ్రత్తగా జరిగింది. నేనేమీ భయపడలేదు. పైగా జలపాలతం అంచున ఉండటం నాకు కిక్కిచ్చింది' అని బదులిచ్చింది. అయినా సరే నెటిజన్లు మాత్రం ఆమెను విమర్శించడం మానుకోలేదు. 'పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి కానీ ఈ చేష్టలను మేమెందుకు మెచ్చుకుంటాం?' అని బుగ్గలు నొక్కుకుంటున్నారు. కొద్దిమంది మాత్రం ఆమె తెగువను పొగడకుండా ఉండలేకపోతున్నారు. అంత పెద్ద ఎత్తులో ఉండే వాటర్‌ ఫాల్స్‌ చిట్టచివరకు వెళ్లాలంటే మాటలు కాదు, దానికి దమ్ముండాలి అంటూ ఆమె సాహసాన్ని ప్రశంసిస్తున్నారు.(చదవండి: దొంగతనం చేసిందే కాక మహిళకే క్లాస్‌ పీకాడు!)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు