Viral Video: మ్యాజిక్‌ ట్రిక్‌ని చూసి నోరెళ్ల బెట్టిన కోతి

4 Feb, 2022 12:42 IST|Sakshi

Monkeys Reaction To Zoo Visitors Magic Trick: మ్యాజిక్‌ అంటే పెద్దలు పిల్లలు అనే తారతమ్యం లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్‌ చేస్తారు. అంతేకాదు కొంతమందికి రకరకాల మ్యాజిక్‌లు గురించి తెలుసుకోవడమే కాక నేర్చుకుంటుంటారు కూడా. అయితే ఇక్కడోక జూలోని కోతి మ్యాజిక్‌ని చూసి ఏ చేసిందో తెలుసా!.

అసలు విషయంలోకెళ్తే... మెక్సికోలోని చాపుల్‌టెపెక్ జూని సందర్శించడానికి వచ్చిన మాక్సిమిలియానో ఇబర్రా అనే వ్యక్తి ఆ జూలో కోతి ముందు సరదాగా ఒక మ్యాజిక్‌ ట్రిక్‌ ప్లే చేయాలని అనుకున్నాడు. అయితే ఆ కోతి మొదటగా ఆ మ్యాజిక్‌ని అంతగా పట్టించుకోకుండా తన ఆహారాన్ని వెతుకుతున్నట్లుగా అటు ఇటూ చూస్తోంది.  ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ వ్యక్తి  చేస్తున్న​ మ్యాజిక్‌ని ఆసక్తిగా తిలకించడం మొదలు పెట్టింది.

అంతే ఆ వ్యక్తి ఆ ఆకుని ఎలా మాయం చేస్తున్నాడో అర్థం కాక మనుషులు ఎలా అయితే తెల్లబోయి చూస్తుంటారో అలానే ఆశ్చర్యంగా చూసింది. పైగా ఆ వ్యక్తి ఏం చే​స్తున్నాడో ఏంటో అన్నట్లుగా విచిత్రమైన హావాభావాలను ఇచ్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.

(చదవండి: ఎలుగుబంటి బోనులోకి బిడ్డను విసిరేసిన తల్లి!! ఆపై ఏం జరిగిందో చూడండి..)

మరిన్ని వార్తలు