అబ్బబ్బా ఏం చేశారు!.. బాలీవుడ్‌ పాటకు దుమ్ములేపిన నార్వే డ్యాన్సర్లు

18 Jun, 2022 18:46 IST|Sakshi

పుట్టినరోజు, పెళ్లి, షష్టిపూర్తి.. వేడుక ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాల్సిందే. ఎన్నో టెన్షన్స్‌, హడావిడీ మధ్య సాగే ఈ పనుల్లో కొంచెం ట్రెండ్‌ మార్చి ఆటపాటలతో హంగామా  చేస్తున్నారు. సంగీతం, డ్యాన్స్‌లను జోడిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.  విదేశాలతో పోలిస్తే ఇండియాలో జరిగే పెళ్లిళ్లకే ఎంజాయ్‌మెంట్‌ ఎక్కువగా ఉంటుంది. తాజాగా నార్వేలో జరిగిన  పెళ్లిల్లో ఓ డ్యాన్స్‌ బృందం తామేం తక్కువ కాదంటూ డ్యాన్స్‌తో దుమ్ములేపారు.


ఓ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్న "క్విక్ స్టైల్" అనే బృందం పాటకు తగ్గట్టు కాలు కదుపుతూ అందర్నీ ఆకట్టుకున్నారు. అబ్బాయిలంతా గ్రూప్‌లా ఏర్పడి బాలీవుడ్‌ సినిమా తన వెడ్స్‌ మనులోని సాలి గాలి పాటకు డ్యాన్స్‌ చేశారు. ఎకరిని మించి ఒకరు ఎనర్జిటిక్‌గా స్టెప్పులేశారు.‘దీనిని మేము ఇంకా పూర్తి చేయలేదు’ అంటూ ఈ వీడియోను దిక్విక్‌స్టైల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో  వైరల్‌గా మారింది.  
చదవండి: క్లాస్‌రూమ్‌లో పిల్లలతో కలిసి స్టెప్పులేసిన టీచర్‌.. అదరహో!

నార్వే దేశస్తుల డ్యాన్స్‌ స్టెప్పులు నెటిజన్ల హృదయాలను దోచుకుంటోంది. ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా వ్యూవ్స్‌, దాదాపు లక్ష లైక్‌లు వచ్చి చేరాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మీ డ్యాన్స్‌ చూసేందుకు మేము కూడా ఇంకా అలసి పోలేదంటూ కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఈ బృందం ఇంతకముందు కూడా అనేక బాలీవుడ్‌ పాటలకు డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియోలను తమ సోషల్‌ మీడియా అకౌంట్‌లలో పోస్టు చేస్తున్నారు. 

A post shared by Quick Style (@thequickstyle)

మరిన్ని వార్తలు