Viral Video: పెరుగు కోసం ట్రైన్‌ ఆపిన లోకో పైలట్‌. తరువాత ఏం జరిగిందంటే!

9 Dec, 2021 15:05 IST|Sakshi

లాహోర్‌: ట్రైన్‌ను ఎక్కడపడితే అక్కడ నిలిపివేయటం టెక్నికల్‌గా అంత సాధ్యమైన విషయం కాదు! ప్రారంభమైన స్టేషన్‌ నుంచి గమ్య స్థానం వరకు ఏయే స్టేషన్లలో నిలపాలో ముందుగానే షెడ్యూల్‌ తయారు చేసి ఉంటుంది. వ్యక్తిగత అసవరాల కోసం రైలును ఆపేందుకు వీలుండదు. అయితే ఓ రైలు లోకో పైలట్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ చేసిన పని తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెరుగు తినాలనిపించి ఏకంగా ట్రైన్‌ను మధ్యలోనే నిలిపివేశాడు ఓ లోకో పైలట్‌ అలాగే అతని సహాయకుడు. చివరికి ఈ విషయం అధికారులకు తెలియడంతో వారిద్దరిని సస్పెండ్ చేశారు. అసలిది ఎక్కడ జరిగిందంటే..

లాహోర్‌ నుంచి దక్షిణ కరాచీ వైపు వెళ్తున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను లోకో పైలట్‌ కన్హా స్టేషన్‌కు సమీపంలో ఆపారు. దీంతో అసిస్టెంట్‌ అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ట్రైన్‌ దిగి పక్కనే ఉన్న షాప్‌లో పెరుగు తీసుకుని తిరిగి రైలు ఎక్కారు. అయితే ఈ దృశ్యాలన్నింటినీ అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విటర్‌లో పోస్టు చేశారు. దీంతో నెట్టింట్లో వైరల్‌గా మరింది. నెటిజన్లు ఈ ఘటనపై రైల్వే అధికారులను ప్రశ్నిస్తూ.. కామెంట్లు చేస్తున్నారు.

‘అతని ధైర్యం చూడండి. రైలును మధ్యలో ఆపి పెరుగు కొంటున్నాడు. పెరుగు కోసం రైలు ఆపితే.. స్వీట్‌ కోసం విమానం వాడుతారా?.. పెరుగు కోసం ట్రైన్‌ ఆపుతావా?’.. అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పాకిస్తాన్‌ రైల్వే మంత్రి అజం ఖాన్‌ స్వాతి స్పందించారు. ఇద్దరిని సస్పెండ్‌ చేయాలని పాకిస్తాన్‌ రైల్వేస్‌ లాహోర్‌ అడ్మినిస్టేషన్‌లను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు సహించబోమని, ఎవరైనా జాతీయ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోవడం నేరమని ఆయన హెచ్చరించారు.
చదవండి: గూగుల్‌ ఇయర్‌ ఇన్‌ సెర్చ్‌ 2021: మనోడు కాదు.. అయినా తెగ వెతికారు!

మరిన్ని వార్తలు