భయానకం: మహిళ కాలుకు చుట్టుకున్న పైథాన్‌

19 Oct, 2020 20:35 IST|Sakshi

కాన్‌బెర్రా: భయంకరమైన దృశ్యం. భారీ పైథాన్‌ ఓ మహిళ కాలును చుట్టేసిన భయానక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కోడుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన మహిళ కాలును పైథాన్‌ చూట్టుకోవడంతో పోలీసు అధికారిని రక్షించిన వీడియోను క్వీన్స్లాండ్‌ పోలీసులు సోమవారం ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. వివరాలు.. చీకట్లో నడుచుకుంటు వెళ్తున్న మహిళకు పైథాన్‌ తన పెంపుడు పిల్లిని పట్టుకుని కనిపించింది. దీంతో ఆ పిల్లిని రక్షించబోయి పైథాన్‌కు ఆమె చిక్కింది. సదరు మహిళ కుడి కాలును చుట్టిప పైథాన్‌ వదలించుకోవాల్సింది పోయి ఆమె దాని తలను నిమురుతోంది. అయితే ఎంతసేపటికి ఆ పైథాన్‌ అలాగే చూట్టేసుకోవడంతో దానిని వదిలించుకునే ప్రయత్నం చేసింది. ఇక అది వదలకపోవడంతో అటుగా వెళుతున్న పోలీసు అధికారిని సహాయం కోరింది. (చదవండి: సర్‌ప్రైజ్‌: ప్రతి ఒక్కరిని ఏడిపిస్తున్న వీడియో)

సదరు మహిళకు అధికారిని పైథాన్‌ను వదలించుకునేందుకు సాయం చేశారు. అనంతరం సదరు అధికారిని అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ‘సాధారణంగా ఎవరైనా పైథాన్‌ను చూడగానే ఆందోళన చెందుతారు. అదే కాలును చుట్టేసుకుంటే భయంతో బెంబేలేత్తిపోతారు. కానీ ఈ మహిళ అలా చేయకపోగా పైథాన్‌ను తన పెంపుడు జంతువుగా చూసింది’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఆ పైథాన్‌ దాదాపు 10 అడుగుల పొడవు ఉన్నట్లుగా అధికారిని పేర్కొంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు వేల్లో వ్యూస్‌ వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. ప్రమాదకర పరిస్థితిలో భయపడకుండా ధైర్యంగా వ్యవహరించిన సదరు మహిళ తీరుకు నెటిజన్‌లు షాక్‌ అవుతూ.. ఆమెపై ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. (చదవండి: సింగపూర్‌ సూపర్‌ పెంటహౌజ్‌ అమ్మకం)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు