Viral Video: ట్రాఫిక్‌ని బట్టి సెట్‌ చేసుకునే డివైడర్

1 Sep, 2022 11:16 IST|Sakshi

మహానగరాల్లో ట్రాఫిక్‌ కష్టాలు గురించి అందరికి తెలిసిందే. ఏదైన పండుగలకు లేదా ప్రత్యేకమైన రోజుల్లో సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లామా! అంతే ట్రాఫిక్‌లో చిక్కుకుపోతాం. అసలు ఆ ట్రాఫిక్‌ నుంచి బయటపడితే ఏదో సాధించనంత ఫీలింగ్‌ వస్తుంది. ఐతే ఆ సమస్యలన్నింటికి చెక్‌పెడుతూ చైనా ఒక కొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. చైనీయులు ఈ ట్రాఫిక్‌ సమస్యను నివారించేందుకు ఒక సరికొత్త విధానాన్ని కూడా అనుసరిస్తున్నారు.

ఈ విషయాలన్నింటిని వినియోగదారులతో పంచుకుంటూ... ఒక వీడియోను పోస్ట్‌ చేశారు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువాచున్యింగ్‌. ఆ వీడియోలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నప్పుడూ క్లియర్‌ చేసేందుకు ఒక రివర్సబుల్‌ లేన్‌ పని తీరు చూపిస్తుంది. ఇది ఏంటంటే...రోడ్డు మధ్యలో ఉండే డివైడర్‌ వెడల్పును కావల్సినట్లుగా ఎడ్జెస్ట్‌ చేసుకుంటూ ట్రాఫిక్‌ని తగ్గించడం.

చైనా వాసులు ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఉదయం ఒక దిశలోనూ సాయంత్రం సమయాల్లో వ్యతిరేక దిశలో వెళ్తారు. అందుకోసం ఆయా దిశల్లో వెళ్లేలా డివైడర్‌ లైన్‌ని సెట్‌ చేసేకునే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ మేరకు ఆ వీడియోలో ఆ డివైడర్‌ లైన్‌ని ట్రాఫిక్‌ కోసం జిప్‌ మాదిరిగా రెండు వాహనాల సాయంతో దగ్గరగా చేయడం కనిపిస్తుంది.

వీటిని రివర్సబుల్‌ ట్రాఫిక్‌ లైన్‌లు అంటారు. ఇవి ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ఉపకరిస్తాయి. ఐతే నెటిజన్లు దీన్ని సరికొత్త సాంకేతిక ఆవిష్కరణగా ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.  అయితే ఇదేమీ కొత్త ఆవిష్కరణ కాదని అమెరికా 1960లలోనే ఈ మౌలిక సదుపాయాల ఆవిష్కరణను ప్రవేశపెట్టినట్లు సమాచారం.

(చదవండి: స్నేహితుడి కోసం ఎంతలా తపించిందో ఆ కంగారు: వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు