Viral Video: రోబోటిక్‌ డాగ్‌ ... సైనికుడిలా కాల్పులు జరుపుతోంది

22 Jul, 2022 14:09 IST|Sakshi

టెక్నాలజీతో మానవుడు అసాధ్యం అనుకున్న వాటన్నంటిని సాధ్యం చేసి చూపించాడు. ఆకాశానికే నిచ్చేన వేసేంతగా టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. అందులో భాగంగానే ఇపుడే ఆర్టిపిషియల్‌ ఇంటిలిజెన్స్‌ పేరుతో అత్యాధునిక రోబోలను తయారు చేస్తున్నాడు. మావనవుడు చేయగలిగే వాటన్నింటిని రోబోలే చేసేలా రూపొందించాడు. అందులో భాగంగానే రూపొందచిందే ఈ రోబో డాగ్‌.

ఈ రోబో డాగ్‌ అచ్చం కుక్క మాదిరిగానే ఉంటూ...పైనా ఆటోమేటిక్‌ మెషిన్‌ గన్‌ అమర్చి ఉంటుంది. ఇది మన పెంపుడు కుక్కల మాదిరిగానే ఇంటిని కాపలా కాస్తూ... దొంగలు చొరబడకుండా ఉండేలా వారిని భయపెట్టేలా కాల్పులు జరుపుతుంటుంది. ఇదే ఈ రోబో డాగ్‌లోని ప్రత్యేకత. ఐతే ఈ రోబో డాగ్‌ని రష్యకు చెందిన ఆటామానోవ్‌ రూపొందించాడు. అతను 'హోవర్‌సర్ఫ్‌' అనే ఏరోపరిశ్రమ వ్యవస్థాపకుడు. అతని కంపెనీ కాలిఫోర్నియాలోని శాస్‌జోస్‌లో ఉంది. అంతేకాదు అతను ఈ రోబో  ఎలా తన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని కాల్పులు జరుపుతుందో కూడా వివరించారు.

ఈ రోబో డాగ్‌ పై అమర్చిన తుపాకీ రష్యన్ - PP-19 విత్యాజ్, AK-74 డిజైన్ ఆధారంగా రూపొందించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం ఇలాంటి రోబోలు అవసరమా అని ప్రశ్నిస్తూ..ట్వీట్‌ చేశారు. ఇలాంటి రోబోలు మనుషులపై దాడులు చేస్తే యజమానులు నేరం నుంచి సులభంగా తప్పించుకునే అవకాశం ఉందంటూ పలు అనుమానాలు లేవనెత్తారు కూడా.

(చదవండి: రైలు వంతెనపై మంటలు...నదిలోకి దూకేసిన ప్రయాణికులు)

మరిన్ని వార్తలు