వైరల్‌: టాయిలెట్‌లోకి పాము ఎలా వచ్చింది!

19 Aug, 2020 14:05 IST|Sakshi

పామును చూస్తేనే గుండె ఆగినంత పనవుతుంది. భయంతో ఒళ్లంతా గగుర్పొడుస్తుంది. ఇటీవల ఈ పాములు జనసమూహంలోకి ఎక్కువగా వస్తున్నాయి. ఇంట్లోకి, ముఖ్యంగా టాయిలెట్లో ఈ మధ్య కాలంలో పాములు దర్శనమిస్తున్నాయి. అలాంటి ఓ భయంకర ఘటనే తాజాగా అమెరికాలో చోటుచేసుకుంది. టెక్సాస్‌ నగరంలో నివసించే గుస్‌ వెస్ట్‌ అనే వ్యక్తి ఇంట్లోని టాయిలెట్‌లోకి పాము చొరబడింది. దీనికి సంబంధించిన వీడియోను వాతావరణ శాస్త్రవేత్త పేటన్‌ మలోన్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో టాయిలెట్‌ బౌల్‌ లోపల పాము కనిపిస్తోంది. ఓ వ్యక్తి దానిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. (టాయ్‌లెట్‌లో నాలుగ‌డుగుల పాము)

అనంతరం ఈ సంఘటన గురించి పాముల‌ను ప‌ట్టేవాళ్లకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పామును పట్టుకున్నారు. ఆ పాము విషపూరితమైనది కాకపోవడంతో దానిని పెరడులో వదిలేశారు. టాయిలెట్‌లో పాము చొరబడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సోమవారం షేర్‌చేసిన ఈ వీడియోను ఇప్పటికే 2.3 మిలియన్ల వ్యూవ్స్‌ వ​చ్చాయి. 10 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. కాగా టాయిలెట్‌లోకి పాము ఎలా చొరబడిందని కొంత మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘టాయిలెట్‌ ఉపయోగం లేని సమయంలో ఎల్లప్పుడూ మూత పెట్టి ఉంచాలి. ఇంటి సమీపంలో కాలువలు, డ్రైనేజీ వ్యవ ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. (జాతీయ రహదారిపై త్రాచు పాము హల్‌చల్‌..)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు