Viral Video: వామ్మో! భగభగమండే సూర్యుని ఉపరితలంపై స్నేక్‌

16 Nov, 2022 17:22 IST|Sakshi

సూర్యుని ఉపరితలం మీదుగా ఒక పాము జరజర వెళ్తున్నటు ఒక అద్భుత దృశ్యం కనువిందు చేసింది. ఈ యూరోపియన్‌ ఆర్బిటర్‌ ద్వారా ఈ సూర్యునిపై ఈ విచిత్రమైన ఘటన కనిపించిందని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఐతే అవి సూర్యుని అయస్కాంత క్షేతం గుండా వెళ్తున్న చల్లటి వాతావరణ వాయువుల గొట్టంగా పేర్కొంది. అది చూడటానికి అచ్చం భగభగమండే సూర్యుని ఉపరితలంపై పాకుతున్న పాములా కనిపిస్తోంది.

దీన్ని పాము రూపంలో ఉన్న ప్లాస్మా అని అది సూర్యునిపై ఒక వైపు నుంచి మరోవైపుకు అయస్కాంత క్షేత్రం ఫిలమెంట్‌ను అనుసరిస్తుందని స్పేస్‌ ఏజెన్సీ తెలిపింది. అక్టోబర్‌ 12న సోలార్‌ ఆర్బిటర్‌ సూర్యుని వైపు ప్రయాణిస్తున్నందున ఈ అరుదైన దృశ్యం చూడగలిగామని ముల్లార్డ్‌ స్పేస్‌ సైన్స్‌ లాబోరేటరీ శాస్త్రవేత్త డేవిడ్‌ లాంగ్‌ తెలిపారు. అదీగాక అయస్కాంత క్షేత్రం వక్రీకృతమైంది కాబట్టి ఈ దృశ్యాన్ని చూడగలిగామని అన్నారు. సోలార్‌ ఆర్బిటర్‌ అనేది ఫిబ్రవరి 2020లో ప్రారంభమైన అమెరికా స్పేస్‌ ఏజెన్సీ, యూరోపియన్‌ స్సేస్‌ ఏజెన్సీల ఉమ్మడి ప్రాజెక్టు. 

(చదవండి: ప్చ్‌! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు)
 

మరిన్ని వార్తలు