Viral Video: ఉక్రెయిన్‌ రాజధాని గత వైభవం సంతరించుకునేలా పూల మొక్కలతో....

7 Apr, 2022 14:22 IST|Sakshi

Woman Hopes Conflict Will Be Over Soon: రష్యా పై ఉక్రెయిన్‌ దాడి చేసి నేటికి 43 రోజులవుతోంది. అక్కడ ఇప్పుడప్పుడే ఈ యుద్ధం ముగిసిపోతుందన్న సంకేతాలు ఏ మాత్రం కనిపించడం లేదు. అదీగాక ఉక్రెయిన్‌ తలవంచకపోవడంతో రష్యా బలగాలు పౌరులపై దాడులకు తెగబడింది. ఆ క్రమంలో బుచా నగరాన్ని శ్మశానంగా మార్చింది. దారుణమై యుద్ధ నేరాలకు పాల్పడుతోంది రష్యా. ఈ నేపథ్యంలో ఒక మహిళ మాత్రం ఉక్రెయిన్‌లో ఉన్న చీకటిని, నిరాశను తరిమేసి ఒక ఆశా దీపాన్ని వెలిగించేందుకు తపనపడుతోంది.

ఉక్రెయిన్‌లో రష్యా సృష్టించిన విధ్వంసం కారణంగా వేలాది మంది నిరాశ్రయలైతే...మరో లక్షలాది మంది ఉక్రెయిన్‌ని విడిచి వెళ్లారు. ఈ తరుణంలో ఆ మహిళ మాత్రం "యుద్ధం యుద్ధమే" అంటూ రాజధాని కైవ్‌లో మొక్కలు నాటుతూ ఆహ్లాదంగా ఉంచేందకు ప్రయత్నించింది. ఎప్పటికైన యుద్ధం ముగుస్తుందని..యుద్ధం యుద్ధమే కానీ మనం ఎక్కువ పూల మొక్కలు నాటాలి అంటూ కొత్త ఆశాల్ని రేకెత్తించింది.

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ శిధిలా నగరంగా మారితే ఆమె మాత్రం రాజధాని కైవ్‌ని పూలమొక్కలతో అందంగా తీర్చిదిద్దాలనుకుంది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లోని సామాన్యుడు సైతం తమ దేశం కోసం తుపాకి చేత బట్టి ప్రపంచ దేశాలను ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఒక వైపు రష్యా నరమేథానికి పాల్పడుతూ...భయంకరంగా విరుచుకుపడుతున్న.. ఆమె ఎప్పటికైన మా దేశాన్ని మేము రక్షించుకుంటాం.

ఈ యుద్ధం కచ్చితంగా ముగిసిపోతుందంటూ ఆమె ఆశాభావంతో మొక్కలు నాటుతున్న విధానాన్ని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. ఆశావాదం నిర్వచనం ఒక దేశం పట్ల అభిమానం, గౌరవం అని చెప్పకనే చెప్పింది ఆమె. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని  బ్రిటన్ చీఫ్ కరస్పాండెంట్ రిచర్డ్ గైస్‌ఫోర్డ్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో నెటిజన్లు వారు నిజమైన యోధుల్లా చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసిస్తూ ​రకరకాలుగా ట్వీట్‌ చేశారు.  

(చదవండి: రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం... చైనాలో మొదలవుతున్న​ భయాందోళనలు)

మరిన్ని వార్తలు