ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్‌ వైరల్‌ వీడియో

23 Nov, 2021 14:32 IST|Sakshi

న్యూయార్క్‌: రోడ్డుపై పలు యాక్సిడెంట్‌ ఘటనలు చూసినప్పటికీ ఇంకా అలాంటి భయంకరమైన ఘటనలు పునరావృతమౌతునే ఉన్నాయి. అంతేకాదు వేగం తగ్గించమని ఎంతలా ట్రాఫిక్‌ యంత్రాంగం మొత్తుకున్న ప్రజల్లో సరైన మార్పు రాకపోవడం బాధకరం. కానీ యూఎస్‌లోని ఇండియానాలో జరిగిన అతి పెద్ద యాక్సిడెంట్‌ చూస్తే ఎవరికైనా భయం వేయాల్సిందే. 

(చదవండి: కొడుక్కి అరుదైన వ్యాధి.. వైద్య చరిత్రలో గుర్తిండిపోయే పనిచేశాడు.. హైస్కూల్‌ చదువుతోనే..!!)

అసలు విషయంలోకెళ్లితే...ఇండియానాలోని ఇండియానాపోలిస్‌లో కనీసం మూడు స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ ఢీ కొన్నాయి. అయితే మొదట రోడ్డు ఖాళీగా ఉందని రెడ్‌ సిగ్నల్‌ పడినప్పటికీ ఒక ఎస్‌యూవీ కారు వేగంగా వచ్చేస్తుంది. అంతే మరో ఎస్‌యూవీ కారు దాన్ని గట్టిగా ఢీ కొడుతుంది. దీంతో అది గాల్లోకి లేచి రహదారికి మరోవైపు పడుతుంది. వెంటనే అటువైపేగా వస్తున్న ఎస్‌యూవీ కారు పై పడి అక్కడ ఉన్న ఆరు కారులను ఢీ కొడుతుంది.

అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదుగానీ, మొత్తం ఆరు కారులు దెబ్బతిన్నాయి. అంతేకాదు ఈ ఘటన జరిగినప్పుడు ఒక పాదచారి నడుచుకుంటూ వెళ్తుంటాడు. అయితే అదృష్టమేమిటంటే అతనికి ఏం కాలేదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్‌ చేసేందుకు...మరీ అలా చేయాలా?)

మరిన్ని వార్తలు