Viral Video: కొట్టేశానోచ్‌! అని పరిగెత్తి... బొక్క బోర్లాపడ్డ దొంగ!

9 Nov, 2022 15:48 IST|Sakshi

ఒక దొంగ మంచి ఖరీదైన వస్తువు కొట్టేశానన్న ఆనందంలో  ముందు వెనుక చూడకుండా పారిపోయేందుకు యత్నించి బొక్క బోర్లాపడి అడ్డంగా దొరికి పోయాడు. ఈ ఘటన యూఎస్‌లోని వాషింగ్టన్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే....వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లో లూయిస్‌ విట్టన్‌ స్టోర్‌ అనే లగ్జరీ షాపుకి ఒక దొంగ వచ్చాడు. అతను ఆ షాపులో సుమారు రూ. 14 లక్షలు ఖరీదు చేసే వస్తువుని దొంగలించి పారిపోయేందుకు యత్నించాడు. ఐతే ఆ షాపుకి  బయటవైపుగా క్లీన్‌గా ఉన్న  అద్దాన్ని గమనించకుండా బయటకు దారి అదే అనుకుని ఆ అద్దం గుండా వెళ్లిపోవాలనుకున్నాడు. అంతే ఆ దొంగ ఆ అద్దానికి గుద్దుకుని ఒక్కసారిగా కింద పడిపోయాడు.

ఇంతలో సెక్యూరిటీ గార్డు వెంటనే అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాడు. అతను 17 ఏళ్ల యువకుడని పోలీసులు చెప్పారు. ఈ బెల్లేవ్‌ నగరంలో ఇటీవల 50కి పైగా ఇలాంటి రిటైల్‌ దోపిడి, షాప్‌ చోరి కేసులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. వారంతా తమను గుర్తుపట్టరన్న ధైర్యంతో చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు పోలీసులు బెల్లేవ్ నగరానికి వచ్చి ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే మరిన్ని కేసులు పెట్టి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి: ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు)

మరిన్ని వార్తలు