కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా

27 Oct, 2021 19:47 IST|Sakshi

పిల్లలకు బాల్యం నుంచే సమయస్ఫూర్తి.. పరిస్థితులను ఎదుర్కొని నిలబడే తెగువ, ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలను అలవాటు చేయాలి. ప్రతి చిన్న విషయానికి కుంగిపోవడం, బెంబేలెత్తడం చేస్తూంటే.. జీవితంలో ముందుకెళ్లడం కష్టమని బాల్యం నుంచే అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకంటే పట్టుమని ఐదేళ్ల వయసు కూడా లేని ఓ చిన్నారి స్టేజీ మీద చూపిన అద్భుత సమసయస్ఫూర్తి, ఆత్మ విశ్వాసం.. నెటిజనలను ఫిదా చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. 

ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందనే వివరాలు తెలియదు. ఇక వీడియోలో ఓ బాబు, పాప ఇద్దరు ర్యాంప్‌ వాక్‌ చేస్తుంటారు. తెల్ల దుస్తుల్లో ఎంతో క్యూట్‌గా ఉంటారు చిన్నారులు. అలా వాక్‌ చేస్తుండగా ఉన్నట్టుండి పాప చెప్పు ఉడిపోతుంది. దాన్ని సరిచేసుకుంటుండగా.. తల మీద ఉన్న కిరీటం కూడా జారిపోతుంది. ఈ సంఘటన చూసి అక్కడున్న పెద్దలంతా ఒక్కసారిగా నవ్వుతారు. కూడా ఉన్న పిల్లాడు నవ్వుతాడు.
(చదవండి: మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్‌)

ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. ఇంత జరిగినా ఆ చిన్నారి ఏ మాత్రం బెదరదు.. సిగ్గుపడదు. వెంటనే తన కిరీటాన్ని సరిచేసుకోవడమే కాక చెప్పు తొడుక్కుని ర్యాంప్‌ వాక్‌ పూర్తి చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.
(చదవండి: హైదరాబాద్‌ మెట్రో: ఇంత దారుణమా.. మనుషులమేనా?!)

ఇది చూసిన నెటిజనులు.. ‘‘చిన్నారి స్థానంలో పెద్దవారు ఉన్నప్పటికి కూడా జరిగిన సంఘటనతో వారు చాలా సిగ్గుపడేవారు. భయపడుతూ.. అక్కడ నుంచి పరిగెత్తే వారు. కానీ ఈ చిన్నారి ఎంతో ఆ‍త్మవిశ్వాసంతో.. ఏమాత్రం తడబడకుండా.. పరిస్థితిని చక్కదిద్దుకుని ముందుకు సాగింది. చాలా స్ట్రాంగ్‌గా నిలబడింది. భవిష్యత్తులో కూడా ఈ చిన్నారి ఇలానే పరిస్థితులకు తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

చదవండి: ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే

A post shared by Beautiful and Wholesome World (@_beautiful_._world)

మరిన్ని వార్తలు