అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ

18 Nov, 2021 11:32 IST|Sakshi

కొన్ని విషయాలు పిల్లల చూసి నేర్చుకునేలా ఉంటాయి. వాళ్ల పసిమనసు, నిష్కల్మషమైన హృదయం, అమాయకత్వంతో చేసే పనులు చాలా గొప్పగా అనిపిస్తాయి. మనకే అనిపిస్తుంది వాళ్లలా మనమెందుకు అంత స్వచ్ఛంగా లేం అని. బహుశా అందువల్లనే ఏమో చిన్నపిల్లలను దేవుడుతో సమానం అంటారు. పైగా వారి అ‍ల్లరిని చూస్తే చాలు అప్పటి వరకు ఉన్న టెన్షన్‌లు చికాకులు అన్ని ఎగిరిపోతాయి. ఒక్కసారిగా చాలా రిలీఫ్‌గా ఫీలవుతాం కూడా. ఇక్కడొక సన్నివేశం కూడా అచ్చం అలానే చాలా సంతోషాన్ని ఇవ్వడమే కాక మనసును కదిలించేలా చేస్తోంది.

(చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ... మోతాదుకు మించి తాగితే కారు స్టార్ట్‌ అవ్వదు!!)

అసలు విషయంలోకెళ్లితే...కియాన్ష్ దేటే అనే బాలుడు బొమ్మలు అమ్ముకునే మహిళ కొడుకు ముందు నిలబడి ఉత్సహంగా డ్యాన్స్‌ చేస్తాడు. పైగా ఆ బాలుడిని కూడా డ్యాన్స్‌ చేయమంటూ కియాన్ష్‌ ప్రోత్సహిస్తాడు. అయితే ఆ మహిళ కొడుకు కియాన్ష్‌ దగ్గరకు వచ్చి ప్రేమగా హగ్‌ చేసుకుంటాడు. ఒక్కసారిగా కియాన్ష్‌ డ్యాన్స్‌ చేయడం ఆపి అలా చూస్తాడు. కాసేపటికీ కియాన్ష్‌ కూడా ఆ మహిళ కొడుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కియాన్ష్‌ తల్లి  అశ్విని నికమ్ దేటే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పైగా ఈ వీడియోకి  మిలియన్లకు పైగా వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. 

(చదవండి: 48 గదులతో కూడిన తొలి పాడ్‌ వెయిటింగ్‌ రూమ్‌!)

A post shared by Kiansh Dete & Ayansh Dete (@kiansh_ayansh)

మరిన్ని వార్తలు