విమానంలో వెకిలి చేష్టలతో రచ్చరచ్చ.. సీటుకు కట్టేసి దేహశుద్ధి

7 Aug, 2021 13:34 IST|Sakshi

వాషింగ్టన్‌: మహిళలపై వేధింపులు ఎక్కడా ఆగడం లేదు. చివరకు విమానంలో కూడా మహిళలకు భద్రతా లేకుండాపోయింది. విమాన సిబ్బందితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రైవేటు భాగాలపై అసభ్యంగా తాకుతూ వేధించడంతో సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసి అతడి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. అతడిని సీటుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. 

అమెరికాకు చెందిన 22 ఏళ్ల యువకుడు మాక్స్‌వెల్‌ బెర్రీ ఫిలడెల్ఫియా నుంచి మియామీకి వెళ్లేందుకు ఫ్రంట్‌టైర్‌ విమానం ఎక్కాడు. అనంతరం మాక్స్‌వెల్‌ విమానంలో నానా హంగామా చేశాడు. విమాన మహిళా సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు తిడుతూ వాగ్వాదానికి దిగాడు. తోటి ప్రయాణికులతో గొడవకు దిగాడు. మరింత రెచ్చిపోయి మహిళా సిబ్బంది ఛాతీపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. జననాంగాలపై చేయి వేసేందుకు ప్రయత్నించగా సిబ్బంది పైఅధికారులకు సమాచారం ఇచ్చారు.  

అతడి తీరుతో విసుగెత్తిన విమాన సిబ్బంది వెంటనే రెండు చేతులు పట్టుకుని అతడిని సీటుకు కట్టేశారు. నోటికి ప్లాస్టర్‌ వేశారు. అయినా కూడా అతడి నోరు అదుపులోకి రాలేదు. పచ్చి బూతులు తిడుతూనే ఉన్నాడు. కాపాడండి అంటూ అరుస్తూ కూర్చున్నాడు. ఈ వీడియోను రికార్డ్‌ చేసిన ప్రయాణికులు సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు దాదాపు 4 మిలియన్స్‌ వ్యూస్‌ వచ్చాయి. 
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు