Viral Video: ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కి వెళ్తే ఇలా ఉంటుందా!

8 Nov, 2022 10:51 IST|Sakshi

అనుకున్నది జరగకపోతే పిచ్చ కోపం వస్తుంది. మహా అయితే ఆ రోజంతా మన మూడ్‌ బాగోక ఎవరితోనూ మాట్లాడకుండా డల్‌ ఉంటాం. కానీ కొందరూ మాత్రం తమకు నచ్చినట్టు జరగకపోతే కోపంతో ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. ఇక్కడొక మహిళ కూడా అచ్చం అలానే ఫ్లైట్‌ మిస్సయ్యానన్న కోపంతో ఎంత దారుణంగా ప్రవర్తించిందో వింటే షాక్‌ అవుతారు. 

వివరాల్లోకెళ్తే...మెక్సికోలో ఎమిరేట్స్‌ అనే అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళను అధికారులు తనిఖీ చేసే నిమిత్తం ఫ్లైట్‌ ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె ఫ్లైట్‌ మిస్సైయ్యింది. అంతే పట్టరాని కోపంతో అక్కడ ఉన్న మహిళా అధికారిపై పిడి గుద్దులతో దాడి చేసి...అక్కడ ఉన్న కంప్యూటర్‌లను అన్నింటి విసిరేస్తూ పెద్ద వీరంగం సృష్టించింది.

అయితే ఆమె గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌తో ఎక్కేందుకు యత్నించడంతో ఆమెను ఫ్లైట్‌ ఎక్కనివ్వకుండా అడ్డుకున్నామని ఎయిర్‌ పోర్ట్‌ అదికారులు తెలిపారు. తాము అడ్డుకున్నమన్న కోపంతో ఆమె తమను దుర్భాషలాడి, దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు రంగంలోకి ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న వస్తువులన్నింటిని కింద పడేసి పెద్ద హంగామా సృష్టించిందన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: చూస్తుండగానే...హఠాత్తుగా కుర్చిలోంచి కుప్పకూలిపోయాడు)

మరిన్ని వార్తలు