Viral Video: వృద్ధురాలి కంటి నుంచి ఏకంగా 23 కాంటాక్ట్‌ లెన్స్‌ తీసిన వైద్యులు

14 Oct, 2022 12:04 IST|Sakshi

ఇంతవరకు పలు రకాల వైరల్‌ వీడియోలు చూశాం. క్లినికల్‌ ఆపరేషన్‌కి సంబంధించిన వీడియోలు అరుదు. అందునా కంటికి సంబంధించిన సర్జరీ వీడియోలు చూసి ఉండం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 

వివరాల్లోకెళ్తే.. అమెరికాలో ఒక వృద్ధురాలికి కాంటాక్ట్‌ లెన్స్‌ ధరించే అలవాటు ఉంది. వాస్తవానికి ఇలాంటి కాంటాక్ట్‌లెన్స్‌ ధరిస్తే రాత్రి పడుకునే ముందు కచ్చితంగా తీసేసి పడుకోవాలి. ఐతే ఆమె అలా చేయడం మరిచిపోయి ప్రతి రోజు మరో కొత్త లెన్స్‌ని వాడటం మొదలు పెట్టింది. ఇలా సుమారు ఒక నెల వరకు ఇలానే చేసింది. ఆ తర్వాత కన్ను నుంచి నీరు రావడం, ఇబ్బందిగా ఉండటంతో ఆ వృద్ధురాలు డాక్టర్‌ వద్దకు వచ్చింది.

దీంతో వైద్యులు ఆమె కంటికి ఒక చిన్న సర్జరీ చేసి సుమారు 23 కాంటాక్ట్‌ లెన్స్‌లను తొలగించారు. ఈ మేరకు డాక్టర్‌ కటెరినా కుర్తీవా మాట్లాడుతూ...ఇలా కాంటాక్ట్‌ లెన్స్‌లు తీయడం మరిచిపోయి మళ్లీ కొత్తది పెట్టడం అనేది చాలా అరుదైన ఘటన అని అన్నారు. కాంటాక్ట్‌ లెన్స్‌ని వేరుచేయడానికి చాలా సూక్ష్మమైన పరికరాన్ని వినియోగించాల్సి వచ్చిందన్నారు.

ఆ కాంటక్ట్‌ లెన్స్‌లన్నీ కంటిలో ఒక నెల వరకు ఉండటంతో ఒకదానికొకటి అతుక్కుపోయి ఉన్నాయని చెప్పారు. ఇలా ఆమె వరుసగా 23 రోజులు చేసిందని అన్నారు. సర్జరీ తర్వా లెక్కిస్తే...కరెక్ట్‌గా 23 కాంటాక్ట్‌ లెన్స్‌లు ఉన్నాయని చెప్పారు. అంతేగాదు సదరు వైద్యురాలు ఆ సర్జరీకి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

A post shared by Ophthalmologist | Dr. Katerina Kurteeva M.D. | Newport Beach (@california_eye_associates)

(చదవండి: బీటెక్‌ చదివితే జాబే చేయాలా.. ‘బీటెక్‌ చాయ్‌వాలి’ వెరీ స్పెషల్‌ అంటున్న నెటిజన్లు!)

మరిన్ని వార్తలు