వైరల్‌: వాల్‌మార్ట్‌లో జింక ఎంట్రీ.. సిబ్బంది ఏం చేసారంటే?

3 Jul, 2021 18:03 IST|Sakshi

మనుషుల అభివృద్ధి పేరుతో నగరాలను విస్తరించూకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతాలు కూడా  జననివాసాలుగా మారుతున్నాయ్‌.దీని కారణంగా అడవులు తగ్గి జంతువులు నగరాల్లో సంచరించడం ఇటీవల మామూలుగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో అవి మనుషుల మధ్య కనిపిస్తు అవి బెదురుతూ మనల్ని భయపెడుతున్నాయి.  కాగా ఈ సన్నివేశాలు రికార్డు కావడం, నెట్టింట వైరల్‌ గా మారి హల్‌ చల్‌ చేయడం తెలిసిందే.

ప్రస్తుతం అలాంటి తరహాలో ఓ జింక్‌ వాల్‌మార్ట్‌లోకి రాగా దాన్ని కంట్రోల్‌ చేయడానికి నానతంటాలు పడ్డాడు ఓ సిబ్బంది. వివరాల్లోకి వెళితే.... విస్‌కాన్సిన్‌ వాల్‌మార్ట్‌లో అనుకోని కస్టమర్‌ రూపంలో ఓ జింక షాపులోకి వచ్చింది. పాపం అక్కడి పరిసరాలు అంతా కొత్తగా ఉండే సరికి కాస్త బెదిరి నానా హైరానా చేసింది. ఇక షాపును ధ్వంసం చేస్తుండడంతో అందులోని ఓ సిబ్బంది మాత్రం ధైర్యంగా ఆ జింకను కట్టడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అందులో.. జింకను నడవకుండా సిబ్బంది చాకచక్యంగా దాన్ని నియంత్రిస్తూ వ్యవహరించాడు. జంతువు పట్టు నుండి బయటపడటానికి ప్రయత్నించినప్పటికీ, వదలకుండా అలానే ఆ సిబ్బంది ఉండగా ఈ క్రమంలో ఇతర సిబ్బంది దాని బయటకు పంపడానికి వెనుక తలుపు తెరిచి పంపేసి హమ్మయ్యా అనుకున్నారు. ఈ ఘటన జూన్ 23 న బారాబూలో జరిగగా, ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారి హల్‌ చల్‌ చేస్తోంది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు