ఒకే మహిళకు 6 డోసుల టీకా.. తర్వాత ఏమైందంటే!

11 May, 2021 13:04 IST|Sakshi

రోమ్‌: ప్రపంచంలో ఎక్కడ చూసిన కరోనా ప్రభావమే కనిపిస్తోంది.  మహమ్మారి అడుగు పెట్టిన ప్రతి చోటా అల్లకల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ తీసుకునే ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే  ఓ మహిళకు ఆరు డోసుల టీకా ఇవ్వడంతో అస్పస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. 24 గంటల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జి అయ్యింది. ఈ సంఘటన ఇటలీలో చోటుచేసుకుంది. ఇటలీలో 23 ఏళ్ల మహిళ కరోనా వ్యాక్సిన్‌ కోసం ఆదివారం టుస్కనీలోని ఆసుపత్రికి వెళ్లింది.

అక్కడ హస్పిటల్‌లోని హెల్త్‌ వర్కర్‌ అనుకోకుండా ఫైజర్‌ వ్యాక్సిన్‌ బాటల్‌లోని మొత్తం డోసులను మహిళకు ఇచ్చింది. అందులో ఆరు డోసులు ఉన్నాయి. కాసేపటి తరువాత మిగతా అయిదు సిరంజ్‌లు ఖాళీగా ఉండటాన్ని చూసి తను చేసిన తప్పుని గ్రహించింది. మరోవైపు ఆరు డోసులు తీసుకున్న మహిళ అనారోగ్యానికి గురవ్వడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేక‌పోవ‌డంతో ద‌వాఖాన నుంచి సోమ‌వారం ఉద‌యం డిశ్చార్జీ చేశారు. అయితే ఓ డాక్టర్‌ ఆమెను నిత్యం ప‌ర్య‌వేక్షిస్తార‌ని హాస్పిట‌ల్ వ‌ర్గాలు వెల్ల‌డించారు. మాన‌వ తప్పిదం వ‌ల్లే ఈ పొరపాటు ఇది జ‌రిగింద‌ని, ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగింది కాద‌ని పేర్కొన్నారు.

చదవండి: రియల్‌ వారియర్స్‌: మా కష్టం కన్నా రోగుల ప్రాణాలే ముఖ్యం

మరిన్ని వార్తలు