41.26 శాతం ఆపరేషన్స్‌.. 465 ఏళ్ల జైలు శిక్ష

12 Nov, 2020 19:34 IST|Sakshi

వర్జీనియా: డబ్బు ఆశకు పోయి ఓ డాక్టర్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అమెరికాలోని గైనకాలజిస్టు విభాగాంలో పనిచేస్తున్న ఓ డాక్టర్‌ అవసరం లేకపోయినా శస్త్ర చికిత్సలు చేసి 465 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొన్నాడు. ఈ డాక్టర్‌ పేరు జావేద్‌ పర్వేజ్‌. వర్జీనీయాకు చెందిన ఈ వైద్యుడు గైనకాలజిస్ట్‌గా పనిచేస్తూ సొంతంగా ప్రైవేటు ఆస్పత్రి నడుపుతున్నాడు. అధిక డబ్బు సంపాదించాలనే దురాశతో ఆయన వద్దకు వచ్చిన రోగులకు అవసరం లేకపోయిన శస్త్రచికిత్స చేయాలని సూచించేవాడు. ఈ క్రమంలో ఎక్కువగా అతడు గర్భసంచి సంబంధిత ఆపరేషన్స్‌ చేసేవాడు. మందులకు తగ్గే జబ్బులకు సైతం ఆపరేషన్‌ చేసేవాడు. అలా ఈ ప్రబుదుడు పదేళ్లలో 52 మందికి అనవసర శస్త్రచికిత్సలు చేసినట్లు అమెరికా మెడికల్‌ కౌన్సిల్‌ గుర్తించింది. (చదవండి: ఈమె 8 మంది శిశువులను చంపారట!)

అయితే ఓ డాక్టర్‌ పదేళ్లలో సగటున 7.63 శాతం మాత్రమే ఆపరేషన్స్‌ చేయాల్సి ఉంటుంది. జావేద్‌ పర్వేజ్‌ మాత్రం పదేళ్లలో ఏకంగా 41.26 శాతం శస్త్ర చికిత్సలు చేశాడు. ఈ వైద్యుడి వద్దకు చికిత్సకు వెళ్లిన కొంతమంది మహిళలు అనుమానంతో మెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. జావేద్‌ ఆస్పత్రిపై రైడ్‌ చేసిన మెడికల్‌ కౌన్సిల్‌ పదేళ్లలో 41.26 శాతం ఆపరేషన్స్‌ చేసినట్లు గుర్తించింది. అతడిని విచారించగా అధిక డబ్బు గడించాలనే ఆశతోనే ఇలా చేసినట్లు సదరు వైద్యుడు ఒప్పుకున్నాడు. దీంతో వర్జీనియా న్యాయస్థానం అతడికి దాదాపు 465 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: ట్రంప్‌ వైఖరి ఇబ్బందికరమే)

>
మరిన్ని వార్తలు