గెలుపునకు చేరువలో ఉక్రెయిన్‌! రష్యా సరిహద్దుకు చేరుకున్న బలగాలు

16 May, 2022 19:24 IST|Sakshi

Mr President, We Made It: ఉక్రెయిన్‌ పై రష్యా గత రెండు నెలలకు పైగా దాడులు కొనసాగిస్తునే ఉంది. ఈ నేపథ్యంలో యూకే రక్షణ మంత్రిత్వ శాఖ నిరవధిక పోరును ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ పరిస్థితి గురించి ఒక నివేదిక విడుదల చేసింది. భూ, గగన, జల మార్గాలలో దాడులు సాగించిన రష్యా బలగాలు ఈ యుద్ధంలో భారీ నష్టాన్నే చవిచూశాయని పేర్కొంది. ప్రస్తుతం యుద్ధంలో రష్యా కాస్త వెనకబడిందని తెలిపింది. రష్యా బలగాల పోరాట సామర్థ్యం తగ్గిందని, చాలామంది సైనికులు పట్టుబడుతున్నారని వెల్లడించింది.

యూకే రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్‌ నివేదిక ప్రకారం రానున్న రోజల్లో రష్యా దళాలు వేగవంతంగా దాడులు చేసే అవకాశం లేదని అంచనా వేసింది. అంతేగాదు ఖార్కివ్‌ ప్రాంతంలో కీవ్‌ దళాలు ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దుకు చేరుకున్నట్లు ఉక్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహదారు వాడిమ్‌ డెనిసెంకో తెలిపారు. ఆస్ట్రియా ఉక్రెయిన్ మాజీ రాయబారి ఒలెగ్జాండర్ షెర్బా "మిస్టర్‌ పుతిన్‌ మేము సాధించాం". "శత్రు రాజ్య సరిహద్దుకు చేరుకున్నాం"  అనే క్యాప్షన్‌ జోడించి మరీ ఉక్రెయిన్, రష్యా సరిహద్దుకు చేరుకున్న ఉక్రెయిన్ సైనికులను చూపించే వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

అంతేగాదు బెర్లిన్‌లో జరిగిన నాటో విదేశాంగ మంత్రుల సమావేశంలో జర్మనీకి చెందిన అన్నలెనా బేర్‌బాక్ ఉక్రెయిన్‌కి తమ  మాతృభూమి రక్షణ కోసం తమవంతు మద్దతుగా సైనిక సహాయం అందిస్తామని  చెప్పారు. మరోవైపు నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ ఉక్రెనియన్లు  తమ ధైర్య సాహసాలతో తమ మాతృభూమిని రక్షించుకోవడమే కాకుండా ఈ యుద్ధంలో తప్పక విజయం సాధిస్తారని ధీమాగా చెప్పారు.

(చదవండి: రష్యాకు మరో షాక్‌! నాటోలో చేరనున్న మరోదేశం)

మరిన్ని వార్తలు