ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ ఫుల్‌ సపోర్ట్‌.. మండిపడుతున్న రష్యా

13 Feb, 2023 15:54 IST|Sakshi

బ్రిటన్‌ ఉక్రెయిన్‌కి మరింతగా మిలటరీ సాయం పెంచుత్నునట్లు ప్రకటించింది. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మద్దతుదారుడు, సన్నిహితుడు అయిన వ్లాదిమిర్‌ సోలోవియోవ్‌ బ్రిటన్‌ తీరుపై మండిపడ్డాడు. ముందుగా బ్రిటన్‌కి అడ్డుకట్టవేసేలా యూకే పార్లమెంట్‌పై దాడి చేయాలంటూ ఫైర్‌ అ‍య్యారు. ఈ ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే పశ్చిమదేశాలపై కూడా విరుచుకుపడ్డారు.  

బ్రిటన్‌ ఫిబ్రవరి 8న మిలటరీ సాయాన్ని తక్షణమే పెంచుతున్నట్లు ప్రకటించింది. అదీగాక ఇటీవలే యూకే ప్రధాని రిషి సునాక్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లొదిమిర్‌ జెలెన్స్కీని కలిసి అక్కడ పైలట్లకు శిక్షణ ఇస్తామని కూడా చెప్పారు.  దీంతో రష్యా ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. ఈ నేపథ్యంలోనే సోలోవియోవ్‌.. ఉక్రెయిన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. రష్యా భూభాగంపై గ‍ట్టిగా దాడి చేసేలా విమానాలు ఇచ్చేందుకు యూకే రెడీ అయిపోయిందంటూ తిట్టిపోశారు. 

అయినా ఉక్రెయిన్‌ విషయంలో యూకే అసలు ఉద్దేశ్యం ఏమిటీ, కేవలం సైనిక బలగాలు మాత్రమే యూకే లక్ష్యం కాదని, వెనుక ఏదో దురుద్దేశమే ఉందని సోలోవియోవ్‌ ఆరోపణలు చేయడం ప్రారంభించారు. రష్యా ఉనికే లేకుండా చేయాలని చూస్తున్న బ్రిటన్‌ని తాము ఇక గుర్తించం అని తేల్చి చెప్పారు. అలాగే ఈ ఉక్రెయిన్‌కి మద్దతు ఇచ్చే జర్మనీ, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ వంటి దేశాలు మాకు లేనేలేవు అంటూ పశ్చిమ దేశాలపై నిప్పులు చెరిగారు సోలోవియోవ్‌.

అందుకు సంబంధించిన వీడియోని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉండగా, జెలెన్స్కీ బుధవారం తమ దేశం చేతిలో రష్యా కచ్చితంగా ఓడిపోతుందని ధీమాగా చెప్పారు. అంతేగాదు రష్యా దురాక్రమణ దాడికి దిగిన తొలి రోజు నుంచి మద్దతు ఇస్తున్న బ్రిటన్‌ ప్రజలకు ధన్యావాదాలు కూడా చెప్పారు జెలన్స్కీ.

(చదవండి: అర్జెంటీనాకి తరలిపోతున్న రష్యన్‌ మహిళలు..వెలుగులోకి కీలక నిజాలు..)

మరిన్ని వార్తలు