'పుతిన్‌ని అధ్యక్షుడిగా కాదు పాలకుడిగానే పిలవాలి'

11 Jul, 2022 21:22 IST|Sakshi

Russian Parliament Gets Proposal: రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్‌ను 'అధ్యక్షుడి'గా కాకుండా "పాలకుడు"గానే పిలవాలని రష్యా పార్లమెంటుకు ఒక ప్రతిపాదని వచ్చింది. పాశ్చాత్య భాషల నుంచి పుట్టుకొచ్చిన పదాలకు దూరంగా ఉండేందుకు పుతిన్‌ను అధ్యక్షుడిగా కాకుండా పాలకుడిగానే పిలవాలని పుతిన్‌ పార్టీ ఈ ప్రతిపాదన తీసుకు వచ్చింది. పుతిన్‌ని మాస్కోకి విధేయుడిగా భావించే డెమెక్రటిక్‌ పార్టీ ప్రెసిడెంట్‌ అనే పదాన్ని ఆంగ్లంలో పాలకుడు అని అర్థం వచ్చే ప్రవిటెల్‌తో భర్తీ చేయాలనుకున్నట్లు పేర్కొంది.  అధ్యక్షుడు అనే పదం ఎల్లప్పుడూ తమను ఇబ్బంది గురి చేస్తోందని పుతిన్‌ పార్టీ పేర్కొంది.  

18వ శతాబ్దపు చివరిలో యునైటెడ్‌ స్టేట్స్‌లో ఈ పదాన్ని తొలిసారిగా ఉపయోగించారని, ఆ తర్వాత ఈ పదం ప్రపంచమంతా వ్యాపించిందని పార్టీ సభ్యులు ఆరోపణలు చేశారు. తమ దేశ చారిత్రక ప్రమాణాల ప్రకారం ఇది కొత్త పదం అని, దీనికి రష్యాలో ఎలాంటి మూలాలు లేవని చెబుతున్నారు. రాష్ట్ర అధిపతి లేదా పాలకుడు అనే పదాలు రెండూ రష్యాకి చెందినవని డెమెక్రటిక్‌ పార్టీ వెల్లడించింది. మాస్కో అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాత్రం ఈ విషయలతో వ్లాదిమిర్ పుతిన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై పుతిన్‌కి ఎలాంటి అభిప్రాయం లేదన్నారు.

ప్రస్తుతం ఇవన్నీ చర్చల దశలోనే ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా 2014లో ఉక్రెయిన్‌ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో విదేశీ భాషల నుంచి అరువు తెచ్చుకున్న పదాలను భర్తీ చేయడానికి ఒక నిఘంటువుని రూపొందించింది.  ఈ నిఘంటువు అరువుగా తెచ్చుకున పదాలు.. రష్యన్‌ భాషలో ఉన్న వైవిధ్యాలను తెలియజేస్తోంది. పరాయి పదాల ఆధిపత్యం మన సంస్కృతికి, భాషకు ప్రమాదకరం అని, దీనికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని పార్లమెంట్‌ అధికారి అన్నారు. 

(చదవండి: ఉక్రెయిన్‌ పౌరులందరికీ రష్యా పౌరసత్వం.... వేగవంతం చేయాలన్న పుతిన్‌!)

మరిన్ని వార్తలు