Vladimir Putin: అదే పుతిన్‌ బలమా..? 

26 Feb, 2022 06:29 IST|Sakshi

Vladimir Putin Political Career: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న పేరు పుతిన్‌. పూర్తిపేరు వ్లాదిమిర్‌ వ్లాదిమిరోవిచ్‌ పుతిన్‌. సోవియట్‌ యూనియన్‌ హయాంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన పుతిన్‌ అంచలంచెలుగా ఎదిగారు. రెండుసార్లు రష్యా ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం నాలుగోసారి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉక్రెయిన్‌పై అకస్మాత్తుగా యుద్ధం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఎవరినీ లెక్కచేయని మనస్తత్వం, దూకుడు వైఖరే పుతిన్‌ను తక్కువ సమయంలో అగ్రస్థానానికి చేర్చిందని ఆయన అనుచరులు అభిప్రాయపడుతుంటారు.  

1960 సెప్టెంబర్‌ 1: ఇంటికి సమీపంలో ఉన్న పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభం.  
12 ఏళ్ల వయసులో సాంబో, జూడోలో శిక్షణ ప్రారంభం. మార్క్స్, ఏంగెల్స్, లెనిన్‌ పుస్తకాలంటే విపరీతమైన ఆసక్తి.  
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ హైస్కూల్‌లో జర్మనీ భాష నేర్చకున్నారు. 
1970లో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ స్టేట్‌ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో చేరిక. 1975లో పట్టభద్రుడయ్యారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ మైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి పీహెచ్‌డీ పూర్తిచేశారు.  
1975లో రష్యా నిఘా సంస్థ కేజీబీలో చేరి 1990 వరకూ సేవలందించాడు. ఫారిన్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా 16 సంవత్సరాలు పనిచేశాడు. సోవియట్‌  పతనం అనంతరం క్రెమ్లిన్‌లో ఉద్యోగిగా చేరారు.  
1997 మార్చి 26న పుతిన్‌ను ప్రెసిడెన్షియల్‌ స్టాఫ్‌ డిప్యూటీ చీఫ్‌గా నియమించిన అప్పటి రష్యా అధ్యక్షుడు బోరిస్‌ ఎల్సిన్‌
1998 జూలై 25న పుతిన్‌ను ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసు డెరెక్టర్‌గా నియమించిన ప్రెసిడెంట్‌  ఎల్సిన్‌
1999 ఆగస్టు 9న ఉప ప్రధానమంత్రిగా నియామకం. అదే రోజు యాక్టింగ్‌ ప్రైమ్‌మినిస్టర్‌గా పుతిన్‌ను నియమిస్తూ  ఎల్సిన్‌ ఆదేశాలు. 
1999 ఆగస్టులో రష్యా ప్రధానమంత్రిగా ఎన్నిక. 
2000 నుంచి 2004 వరకూ.. 2004 నుంచి 2008 వరకూ రెండు సార్లు అధ్యక్షుడిగా సేవలు  
2008 నుంచి 2012 దాకా మరోసారి రష్యా ప్రధానమంత్రిగా బాధ్యతలు 
2012 నుంచి 2018 వరకూ మూడోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు 

చదవండి: (30 ఏళ్ల వివాదం: ఉప్పునిప్పుగా ఉక్రెయిన్‌–రష్యా బంధం)

వ్యక్తిగత జీవితం  
జననం 1952 అక్టోబర్‌ 7  
సోవియట్‌ యూనియన్‌లోని లెనిన్‌గ్రాడ్‌లో(ఇప్పటి రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌) నిరుపేద కుటుంబంలో జననం.  
తల్లిదండ్రులు మరియా మనోవ్నా పుతిన్, వ్లాదిమిర్‌ స్పిరిడోనోవిచ్‌ పుతిన్‌  
ల్యూడ్‌మిలా ఒచెరేటనయాతో పుతిన్‌ వివాహం. 2013లో విడాకులు. వారికి మరియా పుతిన్, కెటరినా పుతిన్‌ ఇనే ఇద్దరు ఆడపిల్లలు సంతానం. జిమ్‌ కోచ్‌ అలీనా కాబయెవా, సినీనటి వెండీ మర్దోక్‌తో సంబంధాలు నెరిపిన పుతిన్‌. 
ఆంగ్ల భాష అంటే పుతిన్‌కు అస్సలు ఇష్టం ఉండదు. మద్యం, సిగరెట్‌ వంటి దురలవాట్లు లేవని సన్నిహితులు చెబుతుంటారు.  
అధ్యక్షుడిగా పుతిన్‌ తీసుకొనే వేతనం సంవత్సరానికి 1,12,000 డాలర్లు. ఆయనకు 70 బిలియన్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అంచనా. ఖరీదైన కార్లంటే పుతిన్‌కు విపరీతమైన ఆసక్తి.   

మరిన్ని వార్తలు