పుతిన్‌ ఆరోగ్యంపై మళ్లీ.. ఇంజెక్షన్లతో నల్లగా మారిన చేతులు

2 Nov, 2022 16:00 IST|Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దిగినప్పటి నుంచి పాశ్చాత్య దేశాలన్ని పుతిన్‌ ఆరోగ్యంపై దృష్టి సారించాయి. పుతిన్‌ ఆరోగ్యం విషమంగా ఉందని ఇక ఆయన ఎన్నోరోజులు బతకరు అంటూ పలు వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఆ తర్వాత యూకే ఇంటెలిజెన్స్‌ పుతిన్‌కి క్యాన్సర్‌ అంటూ ఒక నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత గతేడాది మార్చిలో ఆయనపై హత్యయత్నం జరిగిందని త్రుటిలో తప్పించుకున్నట్లు వార్తలు కూడ వచ్చాయి. ఇప్పడు మళ్లీ ఆయన ఆరోగ్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గుప్పుమంటున్నాయి. పుతిన్‌ ఆరోగ్యం బాగోలేదంటూ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్‌ అవ్వడంతో 

పుతిన్‌ శరీరం రంగుమారిందని, వింత వింత గుర్తులు ఉన్నాయంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అంతేగాక రిటైర్డ్‌ బ్రిటీష్‌ ఆర్మీ అధికారి, హౌస్‌ లార్డ్స్‌ సభ్యుడు రిచర్డ్‌ డానాట్‌ ఒక మీడియా సమావేశంలో పుతిన్‌ ఆరోగ్యం గురించి మాట్లాడారు. పుతిన్‌ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం అని చెప్పారు. అతని చేతులు ఒక్కసారిగా నల్లగా మారిపోయి ఉన్నాయని, ఇలా ఏవైనా ఇంజెక్షన్‌ తీసుకున్నప్పుడూ శరీరం కమిలి ఇలా రంగు మారుతుందని తెలిపారు.

ఇతర భాగాల నుంచి ఇంజెక్షన్‌ తీసుకోలేనప్పుడూ ఇలా జరుగుతుందని చెబుతున్నారు. నిపుణులు కూడా పుతిన్‌ ఇంజెక్షన్‌లు తీసుకుంటున్నారు అనడానికి ఇదే సంకేతం అని తేల్చి చెప్పారు. పుతిన్‌ ఇటీవలె 70 ఏళ్ల వయసులో అడుగుపెట్టారు. వయసు రీత్యా  సమస్యలు ఉండటం అత్యంత సహజం. గానీ ఈ రష్యా ఏ ముహర్తానా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిందో అప్పటి నుంచి పుతిన్‌ ఆరోగ్యం పెద్ద హాట్‌టాపిగా మారిపోయింది. 

(చదవండి: పుతిన్‌ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌...71 వేల మంది రష్యా సైనికులు మృతి)

మరిన్ని వార్తలు