2024 అధ్యక్ష ఎన్నికల బరిలో పుతిన్‌

7 Nov, 2023 06:32 IST|Sakshi

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(71) 2030 వరకు పదవిలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు వచ్చే ఏడాది మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగాలనుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో ఎన్నడూలేని విధంగా అత్యంత ప్రమాదకరమైన కాలంలో రష్యాను నడిపించాలని ఆయన భావిస్తున్నట్లు అక్కడి మీడియా అంటోంది. దీనిపై తుది నిర్ణయమైపోయిందని, ఇందుకు తగ్గట్లుగా పుతిన్‌ మద్దతుదారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనను ఢీకొట్టే ప్రత్యర్థులెవరూ లేరని పరిశీలకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు