మా వ్యాక్సిన్లు భేష్‌: రష్యా

10 Nov, 2020 17:47 IST|Sakshi

మా  వ్యాక్సిన్లన్నీ ఎఫెక్టివ్‌గా ఉన్నాయి

వ్యాక్సిన్ల అంశంలో రాజకీయాలొద్దు : రష్యా

మాస్కో: కరోనా వైరస్‌  మహమ్మారి అంతానికి  వ్యాక్సిన్‌ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు.  రాయిటర్స్‌ సమాచారం  ప్రకారం తొందరలోనే తాము మూడవ వ్యాక్సిన్‌ రిజస్టర్‌ చేయనున్నట్టు పుతిన్‌ వెల్లడించారు. అలాగే రష్యా తయారు చేస్తున్న వాక్సిన్లు  అన్నీ ప్రభావవంతంగా ఉన్నాయని మంగళవారం ప్రకటించారు. అలాగే వ్యాక్సిన్ల తయారీలో  ఇతర అన్ని దేశాలకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.  (కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌ పురోగతి)

కాగా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కసరత్తు జరుగుతోంది. ముఖ‍్యంగా ఆస్ట్రాజెన్‌కా ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాల్లో ఉండగా,  మూడవ దశ ట్రయల్స్‌లో తమ వ్యాక్సిన్‌ 90 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉందని అమెరికాకు చెందిన ఫైజర్‌, జర్మన్‌ ఫార్మా సంస్థ బయోన్‌టెక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు