క్వారంటైన్‌లోకి పుతిన్‌ 

15 Sep, 2021 08:46 IST|Sakshi

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ సన్నిహితులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పుతిన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.  పుతిన్‌ ఇప్పటికే స్పుత్నిక్‌–వీ టీకా రెండు డోసులు తీసుకున్నారు. పుతిన్‌ ఆరోగ్యంతో ఉన్నారని ప్రభుత్వ అధికారి ప్రతినిధి మిట్రీ పెస్కోవ్‌ చెప్పారు. క్వారంటైన్‌లో ఉన్నాగానీ అధికారిక కార్యకలాపాలు అన్నీ చేస్తారని తెలిపారు. మరోవైపు పుతిన్‌ కరోనా పరీక్ష చేయించుకుంటే నెగెటివ్‌ వచ్చింది.vladimir putin

అయితే ఈ విషయాన్ని తొలుత ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. పుతిన్‌ కరోనా పరీక్ష చేయించుకున్నారని, ఆరోగ్యంతో ఉన్నారని మాత్రమే వెల్లడించింది. అయితే పెస్కోవ్‌ను విలేకరులు పుతిన్‌కు కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చిందా అని ప్రశ్నించగా ఆయన అవును అని మాత్రమే బదులిచ్చారు. అయితే పుతిన్‌కి సన్నిహితంగా వ్యవహరించిన వారిలో ఎవరెవరు కరోనా బారిన పడ్డారో వివరించలేదు. సోమవారం పుతిన్‌ ఎన్నో బహిరంగ సమావేశాలకు హాజరయ్యారు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు