Vladimir Putin: ఉక్రెయిన్‌ విడిచి వచ్చిన పౌరులకు... బంపరాఫర్‌ ప్రకటించిన పుతిన్‌

28 Aug, 2022 15:02 IST|Sakshi

మాస్కో: ఫిబ్రవరి 18 నుంచి ఉక్రెయిన్‌ విడిచి రష్యాకు వచ్చిన పౌరులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంచి ఆఫర్‌ ఇచ్చారు. ఈమేరకు పుతిన్‌  ఉక్రెనియన్‌ భూభాగాన్ని విడిచి పెట్టి రష్యాకు వచ్చిన వారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చే డిక్రీ పై సంతకం చేశారు. ఉక్రెయిన్‌ పౌరులకు, పెన్షనర్లకు, మహిళలకు, వికలాంగులకు నెలవారి భృతి సుమారు రూ 13 వేలు అందించేలా రష్యా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.  

రష్యాకు తరలి వచ్చిన ప్రతి ఒక్క ఉక్రెయిన్‌ పౌరుడికి ఈ భృతిని చెల్లించాలని పుతిన్‌ ఆదేశించారు. ఒక పక్క రష్యా దురాక్రమణ యుద్ధానికి దిగుతూనే ఉక్రెయిన్‌ రష్యన్లకు పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తోంది. మరోవైపు యూఎస్‌, ఉక్రెయిన్‌, పశ్చిమదేశాలు, చట్ట విరుద్ధమైన చర్య అంటూ గొంతు చించుకుంటున్నా రష్యా మాత్రం ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించుకుంటోంది. 

(చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు భారీ ప్రాణ నష్టం.. ఎన్ని వేల మంది సైనికులు చనిపోయారంటే..?)

మరిన్ని వార్తలు